Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనువాద మధు బిందువులు-79

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

~

ప్రభూ

ఓ నా ప్రభూ,

ఒకవేళ నేను నరకపు భయంతో
నిన్ను పూజిస్తుంటే
నన్ను నరకంలోనే దహించు

స్వర్గంమీది ఆశతో పూజిస్తుంటే
స్వర్గపు ద్వారంలోకి నన్ను అనుమతించకు

కానీ నీకోసం మాత్రమే పూజిస్తుంటే
నీ సాంగత్యాన్ని నాకు అనుగ్రహించు

అరబిక్ మూలం: రాబియా
ఆంగ్లానువాదం: జేన్ హర్ష్ ఫీల్డ్
అనువాదం: ఎలనాగ

Exit mobile version