‘సంచిక’ -తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు అభినందనలు.
ఇది సంక్షుభిత వర్తమానం. కోవిడ్-19 వైరస్ మహమ్మారిలా ప్రపంచంపై దాడి చేసింది. వేరే దేశాలలో మృతుల సంఖ్య అధికంగానే ఉన్నా, మన దేశంలో ప్రభావితుల సంఖ్య పరిమితంగా ఉండడం కొంత ఊరటనిచ్చే అంశం. ఈ వైరస్‌ని నియంత్రించడంలో స్వీయ సంరక్షణా చర్యలే ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ, అధికారులు సూచించిన విధంగా ఇళ్ళలోనే ఉంటూ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తోడ్పడుదాం.
ఎప్పటిలానే ఈ ఏప్రిల్ 2020 సంచికలో – ప్రత్యేక వ్యాసం, వ్యాసాలు, కాలమ్స్, కథలు, యాత్రాకథనం, కవితలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’.
1 ఏప్రిల్ 2020 నాటి ‘సంచిక’లోని రచనలు:
ప్రధాన వ్యాసం:
నెగటివ్ థాట్స్ గుడ్‌బై! – శ్రీసత్య గౌతమి
వ్యాసాలు:
ఉషశ్రీ సుసంధితమైన చాపం నుండి… – కోవెల సుప్రసన్నాచార్య
నకుల సహదేవులు – అంబడిపూడి శ్యామసుందర రావు
అమ్మ కడుపు చల్లగా – ఆర్. లక్ష్మి
నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు శ్రీశ్రీ -1 – కోవెల సంతోష్‌కుమార్
కాలమ్స్:
రంగులహేల-25 డ్రీమ్ హస్బెండ్స్… అండ్… రియల్ హస్బెండ్స్ – అల్లూరి గౌరిలక్ష్మి
కథలు:
సెప్పు – నల్ల భూమయ్య
వీక్‍నెస్ – ముమ్మిడి శ్యామలారాణి
అభినందనీయుడు – తోట సాంబశివరావు
అనగనగా నేను – అందె మహేశ్వరి
ఇది సినిమా కాదు – ఐతా చంద్రయ్య
కవితలు:
కరోనా… కుచ్ కరోనా – శ్రీధర్ చౌడారపు
ఇవి చాలు – డా. విజయ్ కోగంటి
పూలు ముళ్ళు – సుజాత పి.వి.ఎల్.
ఓటమి నేర్పే పాఠం – గొర్రెపాటి శ్రీను
పాపం – కె. కవిత
గళ్ళ నుడికట్టు:
పద ప్రహేళిక 4: దినవహి సత్యవతి
పర్యటన:
పనామాలో మా పర్యటన – నర్మద రెడ్డి
పుస్తకాలు:
‘చినుక తాకిన నేల’ పుస్తక సమీక్ష – తాడిమేటి లక్ష్మీ గాయత్రి
బాలసంచిక:
తొక్కుడు బిళ్ళ – డి. చాముండేశ్వరి
విరాళం – దాసరి శివకుమారి
5 ఏప్రిల్ 2020 ఆదివారం నాటి సంచికలో కాలమ్స్, కథలు, కవిత, భక్తి పర్యటన వ్యాసం, సినీ విశ్లేషణ, సినీ సమీక్ష, బాలసంచిక, తదితర రచనలు ఉంటాయి.
సంచికకు పాఠకాదరణ పెరుగుతునే ఉంది. పాఠకుల కోరిక మేరకు కొత్త అంశాలు ప్రవేశపెట్టడానికి సంచిన నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. త్వరలో మరికొన్ని కొత్త ఫీచర్స్, ఇంటర్వ్యూలు, ధారావాహికలతో సంచిక పాఠకులను అలరించనుంది.
సంచికపై మీ ఆదరణని ఇలాగే కొనసాగిస్తారనీ ఆశిస్తున్నాము.
సంపాదక బృందం.