Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆశ (నిషా) రాం..రాం..

దొంగ బాబాలు, నకీలీ స్వాములకు చివరికి ఏమవుతుందో చెబుతున్నారు సింగిడి రామారావుఆశ (నిషా) రాం..రాం..” కవితలో.

విత్ర ముసుగులో
అపవిత్ర చేష్టలు
మేకతోలు కప్పుకున్న మృగాలు
ఆశను చంపుకోలేక
కామవాంఛను కాదనుకోలేక
వృద్ధులైనా బాబాలుగా చలామణై
చివరికి జైలు పాలు
ఇవి కావా దేవుడున్నాడని చెప్పే నిదర్శనాలు
నిప్పును అర చేతితో అణచలేము
తప్పు చేసి శిక్షను తప్పించుకోలేము
హాయి అనుకున్న అత్యాచార అనుభవం
జీవితాంతం రోదన, ఆక్రందన
కూడబెట్టిన అక్రమ కోట్ల ధనం
కునుకు పట్టనివ్వని శాపం
కుళ్ళిపోయే భావాలతో కుదుట పడదు జీవితం
అయ్యో అనేవారే లేక చీ..చీ అనిపించుకునే బ్రతుకు
నిత్యనరకం
చిదంబర రహష్యం తెలుసుకోలేకపోతే
చివరకు మిగిలేది దుః ఖ మే…

Exit mobile version