Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అతడు

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘అతడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


భ్యతగా మాట్లాడుతున్నాడంటే
మనుషుల పట్ల ఎంతో అవగాహన
పెంచుకున్నట్లేనని అర్థం అయింది

అంచనాలను దాటిపోతున్నాడంటే
పట్టుదలతో లక్ష్య సాధనకై ఎంతో
శ్రమకోర్చుకున్నట్లేనని అవగతమైంది

విషయ సేకరణ చేస్తున్నాడంటే
విరివిగా సముపార్జించిన విజ్ఞానం
విస్తరింపజేస్తున్నట్లేనని విశదమైంది

ఆధిపత్యాన్ని కోల్పోతున్నాడంటే
ఒక్కెత్తున ఒక్కోఆశను వదలుకొని
అదుపులోకి వస్తున్నట్లేనని తోస్తుంది

Exit mobile version