సంచికలో తాజాగా

తాతా కామేశ్వరి Articles 2

తాతా కామేశ్వరి గారు ప్రవాస ఆంధ్రులు. ఈమె జననం అంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం జిల్లా, చీపురుపల్లి గ్రామం. అక్కడే మావయ్యగారి ఇంటి వద్ద ఉండి చదువు పూర్తి చేసుకుని చక్రధర్‌పూర్, బీహర్ (ప్రస్తుతం ఝార్ఖండ్) లో అమ్మానాన్నల వద్ద ఉండి రైల్వేలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసి వివాహం అనంతరం దుర్గాపూర్, వెస్ట్ బెంగాల్‌లో సుమారు 30 ఏళ్లు ఉన్నారు. వీరికి చిన్నతనం నుండి వ్రాయడం అంటే చాలా మక్కువ. కానీ కుటుంబ బాధ్యతల వల్ల ఆ కోరిక తీరలేదు. సుమారు 5-6 సంవత్సరాల క్రిందట పిల్లల ప్రొత్సాహంతో 70 ఏళ్ళ వయసులో ఈమె మళ్లీ కలం పట్టుకుని చిన్ననాటి కోరిక తీర్చుకుంటున్నారు. ఇప్పటికి మూడు కధా సంపుటులు, వెలుగు - స్ఫూర్తిదాయక కథలు, అర్పణ - అమూల్యమైన కథలు, నివేదన - అపురూప కథా మణిహారం; ఇంకా ఆంగ్లంలో వంటల పుస్తకం - 'చట్నీస్ ఫర్ ది సోల్' వ్రాసారు. వీరి పుస్తకాలు ప్రజాదారణ పొంది ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ మరియు అచ్చంగా తెలుగు లాంటి ఆన్‍లైన్ సైట్స్‌లో లబిస్తున్నాయి. వీరి కథలు సరళమైన భాషలో ఉండడం చేత పాఠకుల మనసును హత్తుకుంటాయి. కామేశ్వరి గారు ప్రస్తుతం ముంబైలో పిల్లల వద్ద ఉంటున్నారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!