శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి గారు సంగీత సాహిత్యాలలో విశేషమైన ప్రజ్ఞ కలవారు. వీణా విద్వాంసురాలు. 11 వరల్డ్ రికార్డ్ల గ్రహీత. 300కు పైగా కథలు, 2500 పైగా కవితలు, 18 నవలలు, వ్యాసాలు 2000 పైగా, వంటలు 1500 వ్రాసారు. 6000కి పైగా వివిధ అంశాల ప్రచురణ. వారికి 126 పైగా బిరుదులు పురస్కారాలు లభించాయి. అనేక అవధానాలలో పాల్గొని వర్ణన, సమస్య, దత్తపది అంశాలు అడిగారు. ఎన్నో సభలలో కర్ణాటక సంగీతం, శ్రీ అన్నమయ్య శ్రీ వెంటేశ్వరస్వామి కీర్తనలు, లలిత సంగీతం ఆలపించారు. ప్రముఖ వ్యక్తులను, మహిళలను, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేశారు. తెలుగు సాహితీ వైభవంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు.
అంతర్జాల కవి సమ్మేళనాలు 1800 పైగా వీణ కచ్చేరీలు అంతర్జాలంలో 68 పై గా సూర్య వర్ణం నూతన లఘు ప్రక్రియలో 150 కవులు పాల్గొని విజయవంతం చేశారు.
మోడరన్ టైలరింగ్ బుక్, సంగీత స్వర రవళి బుక్ వెలువడినాయి. వీరి నవలలు కథలు, 516 కవితలపై విద్యార్థులు పరిశోధన చేస్తున్నారు. 'ఉదయం' ద్వారా వీరి వంటల వీడియోలు వస్తున్నాయి.
'పల్లెలే జాతి పట్టుకొమ్మలనీ, పల్లెల్ని తీర్చిదిద్దితే జనమంతా ఎంతో ఆదర్శంగా ఉంటారనీ భావించే ఓ దర్శకుడి కథనందిస్తున్నారు నారుమంచి వాణీ ప్రభాకరి. Read more
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *
Keep moving the story..*