Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవధాన విద్యా వికాస పరిషత్, 5వ పద్య, అవధాన శిక్షణా శిబిరం – ప్రవేశ ప్రకటన

అవధాన విద్యా వికాస పరిషత్, భాగ్యనగరం వారు – అయిదవ పద్య, అవధాన శిక్షణా శిబిరంలో ప్రవేశానికై ప్రకటన జారీ చేశారు.

ఐదవ శిబిరంలో పద్య శిక్షణ, అవధాన శిక్షణ రెండూ ఉంటాయి. విద్వత్కవులు, విఖ్యాత అవధానులు స్వయంగా పాల్గొని పాఠాలు చెప్తారు. ముందుగా దరఖాస్తు నింపి పంపిన వారికే అవకాశం ఉంటుంది. తెలుగు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోగలరు.

ఉచితభోజన ఆవాసం కల్పించి అందిస్తున్న ఈ సేవలను అందుకొని భావితరాలకు మన పద్యవిద్యా వారసత్వాన్ని అందించండి.

మరుమాముల దత్తాత్రేయ శర్మ, అధ్యక్షులు
కె.వి.ఎన్. ఆచార్య, ప్రధాన కార్యదర్శి
అవధాన విద్యా వికాస పరిషత్, భాగ్యనగరం.

 

Exit mobile version