
కన్నడంలో ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు వ్రాసిన ‘మత్తె మూకజ్జి’ నవల తెలుగు అనువాదాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము.
ప్రఖ్యాత కన్నడ రచయిత శ్రీ శివరామ కారంత్ గారికి జ్ఞానపీఠ పురస్కారం అందించిన నవల ‘మూకజ్జియ కనసుగళు’. కన్నడ సాహిత్యంలో ఉన్న వారసత్వానికి అనుగుణంగా శివరామ కారంత్ గారి ఆ నవలకి కొనసాగింపుగా ‘మత్తె మూకజ్జి’ అనే నవలని వెలువరించారు ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు. ఇది కేవలం కొనసాగింపు మాత్రమే.
అవ్వగారి పేరూ నైజం పాత్ర చిత్రణం మూకజ్జిలాగే ఉంటాయిగానీ ఆ మూకజ్జి వేరు – ఈ అవ్వగారు వేరు. ఈ మూకజ్జి పాత్రని ధనంజయ లక్ష్మీ రామకృష్ణగారు ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దారు.
ఆ కొనసాగింపులోని ప్రతిభాపాటవాల్ని తెలుగువారికి పరిచయం చెయ్యడం కోసం ‘మత్తె మూకజ్జి’ అనే కన్నడ నవలని ‘అవ్వగారు’ పేరుతో అనువదించారు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.
~
ఈ చక్కని అనువాద నవలని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.
చదవండి.. చదివించండి..
అవ్వగారు (అనువాద నవల)
వచ్చే వారం నుంచే..
