[సౌనిధి గారు రచించిన ‘బాల్యం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
అమ్మఒడిలో ఒదగడానికి
నాన్న వెంట నడవడానికి
ఆటపాటల్లో మునగడానికి
బడిలో పాఠాలు నేర్వడానికి
కలువల కొలనులో ఈదడానికి
ఇసుక తిన్నెలలో గూళ్ళు కట్టడానికి
చిన్ననాటి స్నేహాన్ని పొందడానికి
తరగని సంతోషాన్ని పంచడానికి
చెదరని చిరునవ్వు చిందించడానికి
చెరగని జ్ఞాపకాలు అందించడానికి
మరలా తిరిగిరా బాల్యమా.. నా దరికి..