Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బాధనే అద్దెగా కట్టాలి

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘బాధనే అద్దెగా కట్టాలి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

పోయే వారు పోతారు
వెంటపడినా వేదన చెందినా
వారు ఉండేది లేదు గోడు వినేది లేదు
పోతే పోనీయ్ ఎవరైనా అనుకుంటే మేలు
రావాలనుకున్న వారు ఏదోనాటికి వస్తారు
ఈ రాకపోకల బంధాలలో బాదరబంధీ బంధుత్వాలలో
బాధలే తప్ప ఆనందాలు కానరావు
అందుకే పోయేవారికి టాటా చెప్పేయాలి
ఘనంగా వీడ్కోలు ఇచ్చేయాలి
మనసు గదిలో వారిని అలాగే ఉంచితే
బాధ అనే అద్దెను కడుతూ ఉండాలి
కన్నీళ్ళతో కలకాలం కాపురం ఉండాలి.

Exit mobile version