Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘బడి మొగ్గలు’ పుస్తకావిష్కరణ – వార్త

పాలమూరు జిల్లా ప్రముఖ కవి డా. భీంపల్లి శ్రీకాంత్ రచించిన ‘బడి మొగ్గలు’ పుస్తకాన్ని ఆ  జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆవిష్కరించారు. ఆగష్టు 21 న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి జీవితానికి దిశానిర్దేశం చేసే బడి గురించి, ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాల గురించి రచయిత రాయడం ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న గౌరవభావం తెలియజేస్తుందన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశలో ఇలాంటి రచనలెన్నో దోహదపడుతాయన్నారు.

జిల్లా విద్యాశాఖాధికారి డా.ఐ. విజయకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే విధంగా ఈ పుస్తకం రూపుదిద్దుకుందన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులందరూ బడులను, విద్యార్థులను ప్రోత్సహిస్తే వారిలో ఉన్న నైపుణ్యాలను వెలుగులోకి వస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఎ.ఎం.ఓ. దుంకుడు శ్రీనివాస్, జి.సి.డి.ఓఓ. అస్రాఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version