Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బహుశా

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘బహుశా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నా బలహీనత
నీకు బలాన్నిచ్చి
నన్ను బానిసను చేసింది

నా అవసరం
నీకు అవకాశాన్నిచ్చి
నన్ను బందీని చేసింది

నా అపజయం
నీకు విజయాన్నిచ్చి
నన్ను అశక్తున్ని చేసింది

నా అమాయకత్వం
నీకు నాయకత్వాన్నిచ్చి
నన్ను పరాయిని చేసింది

Exit mobile version