
సంచిక ఇటీవల నిర్వహించిన కథల పోటీ విజయవంతమైన నేపథ్యంలో, మరొక పోటీ.. ఈసారి పిల్లల కోసం నిర్వహిస్తున్నాము. 2026 వినాయక చవితి సందర్భంగా ఈ పోటీ నిర్వహిస్తున్నాము.
ఈ పోటీ ముఖ్య ఉద్దేశం బాలబాలికలలో సాహిత్యం పట్ల ఆసక్తి పెంచడం, వారిలోని సృజనాత్మకతను పెంపొందించడం, వారు కూడా చిన్న చిన్న రచనలు చేసేట్టు ప్రోత్సహించడం.
కథల్లో నీతి బోధలున్నా, మరీ ఉపన్యాసాల్లా కాకుండా, సందేశం కథలో అంతర్లీనంగా ఉంటే బాగుంటుంది. ఏ అంశం మీద కథ వ్రాయలన్నది రచయితల ఇష్టం. కానీ సరళమైన భాషలో పిల్లలచే చదివించగలగాలి.
పిల్లల ఊహాశక్తికి పదును పెట్టేలా కథ ఉండాలి. అద్భుత ప్రపంచాలు, జంతువుల లోకం లేదా సాహసాల గురించి వ్రాసినా, అతిశయోక్తుల్లా ఉండకుంటే బావుంటుంది. పిల్లలలో కుతూహలాన్ని పెంచేలా కథలు ఉండాలి.
కల్పన ఏదయినా, ఊహ ఏదయినా అర్థవంతంగా, ఆసక్తికరంగా, తార్కికంగా వుండాలి.
మొత్తం బహుమతుల విలువ రూ. 10,000/-
పోటీకి వచ్చిన కథలలో ఉత్తమమైన కథలను ఎంపిక చేసి బహుమతులు అందచేస్తాం.
కథల నిడివిపై పరిమితి లేదు. ఒక్కొక్కరు ఎన్ని కథలనైనా పంపవచ్చు. కథకులకు వయసు పరిమితి లేదు. ఏ వయసులో వారైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు.
కథను టైప్ చేసి పంపితే సంతోషం. టైప్ చేయించి పంపేవారు పిడిఎఫ్‍తో పాటు ఓపెన్ ఫైల్ కూడా పంపాలి.
చేతి రాతతో పంపేవారు కథను చివరి తేదీ వరకూ ఆగకుండా కాస్త ముందుగానే పంపటం వాంఛనీయం!
***
నియమ నిబంధనలు:
- ఇంతకుముందు ఎక్కడా (ప్రింట్ పత్రికలలో కానీ, వెబ్ పత్రికలలో కానీ, వ్యక్తిగత బ్లాగులలో కానీ, ఫేస్బుక్/వాట్సప్ గ్రూపులలో కానీ) ప్రచురితం కాని కథలను మాత్రమే పోటీకి పంపాలి.
- ఇప్పటికే ఎక్కడైనా పరిశీలనలో ఉన్న రచనలు పోటీకి అనర్హం.
- పై అంశాలను ధృవీకరిస్తూ హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి.
- రచనకు ఏ కలం పేరు వాడినా రచయిత/రచయిత్రి అసలు పేరు తప్పనిసరిగా హామీ పత్రంలో రాయాలి.
- కథ అనువాదం, అనుకరణ, అనుసరణ కాదని హామీపత్రంలో స్పష్టం చేయాలి.
- ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా కథలు పంపవచ్చు.
- బహుమతుల విషయంలో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
- కథల ప్రతులపై రచయిత/రచయిత్రి పేరు ఉండరాదు. విడిగా హామీపత్రంపై మాత్రమే పేరు, ఫోన్ నెంబరు, ఈ-మెయిల్ ఐడీ తప్పనిసరిగా రాయాలి.
కథలు పంపవలసిన చివరి తేదీ 31/08/2026.
పంపాల్సిన విధానం:
- మెయిల్ ద్వారా కథలు పంపాల్సిన చిరునామా – kmkp2065@gmail.com మెయిల్ సబ్జెక్ట్ లైనులో – ‘సంచిక బాలల కథల పోటీ 2026 కి’ – అని వ్రాయాలి.
- వాట్సప్ ద్వారా అయితే – 9849617392. ‘సంచిక బాలల కథల పోటీ 2026 కి’ అని వ్రాయాలి. వాట్సప్‌లో కథలు పంపినవారు తమ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తప్పక పేర్కొనాలి.
- By Post (పోస్ట్ ద్వారా అయితే):
(గమనిక: పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా కథ కాపీ తమ దగ్గర వుంచుకోవాలి).
Sanchika Web Magazine
Plot no 32, H. No. 8-48
Raghuram Nagar Colony.
Aditya Hospital lane
Dammaiguda, Hyderabad-500083
అనే చిరునామాకి పంపాలి. పోస్టల్ కవర్ మీద తప్పనిసరిగా ‘సంచిక బాలల కథల పోటీ 2026 కి’ అని వ్రాయాలి.
ఫలితాలు 14 సెప్టెంబర్ 2026 నాడు వెలువడతాయి. అనంతరం సంచిక వెబ్ పత్రికలో బహుమతి పొందిన కథలు, సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలూ వరుసగా ప్రచురితమవుతాయి.
బాలసాహితీవేత్తలు అత్యధికంగా పాల్గొని ఈ పోటీని విజయవంతం చేయగలరని ఆశిస్తున్నాము.
ధన్యవాదాలు
