Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బలివేంద్రం!

[శ్రీ దర్భముళ్ళ చంద్రశేఖర్ గారు రచించిన ‘బలివేంద్రం!’ అనే కవితని అందిస్తున్నాము.]

చూశాను.. చూపును చిల్లు చేశాను!
రాత్రి భగ్ననిద్రలో
గొడ్డు చర్మాల మీదుగా
దుడ్డు నిప్పు కణికల్ని
బరక బరకగా పొడిగా రాలుస్తూ
ఎడాపెడా రెక్కల్ని మొలిపించేస్కుని
మెరక మెట్టపై ఎగుర్తూ పోతున్న
మొరటు తోడేళ్ల ఉనికికి!

విన్నాను.. మనేదతో మిన్నకున్నాను!
మదభూతం నవ్విన ముసిముసి నవ్వుకి
పొడుచుకొచ్చిన మొటిమల్లా
ఎకసక్కలాడే ఎరుపు రంగు పొక్కుల్లా
రౌద్రంగా రసికారుస్తున్న చుక్కల చప్పుడికి!

కమిలాను.. కాయం కదిలేలా కుమిలాను!
రక్కెస మొక్కల శోషణలో
రేపవళ్ళ తేడా తొలగినప్పుడు
బలవంతాన చితికి బంకముద్దై పోయిన
పసి మొగ్గల పసరు వాసనలు పితికి!

వేటు వేశాను.. వాసితో రాశిగా పోశాను!
యుద్ధం మధ్యలో నన్ను నేను
మిరాశీగా చేస్కుని
పోగులు పోగులుగా తలపుల్ని తెగటార్చి
రక్తపు కూడును వార్చాను.. విందుకి!

మెక్కాను.. కలవరంతో కంగు తిన్నాను!
ఆకాశపు కంతలలో
తలలూడి వేలాడుతున్నా
ఆరని జ్వాల

Exit mobile version