
సంచిక అంతర్జాల పత్రిక సహకారంతో బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026 నిర్వహించబడుతోంది.
ఈ పోటీని బెహరా సత్యనారాయణమూర్తి, కలిగొట్ల సన్యాసిరాజు నిర్వహిస్తున్నారు.
ఈ పోటీలో పాల్గొనవలసిందిగా కథకులకు ఆహ్వానం పలుకుతున్నాము.
మొత్తం బహుమతుల విలువ రూ. 10,000/-
ఏ అంశంపై రాయలన్నది రచయితలే నిర్ణయించుకుంటారు అంటే ఇతివృత్తం రచయితల ఇష్టం. కల్పన ఏదయినా, ఊహ ఏదయినా అర్థవంతంగా, ఆసక్తికరంగా, తార్కికంగా వుండాలి. సందేశాలు, నీతులు అంతర్లీనంగా, ప్రతీకాత్మకంగా వుంటే మంచిది. అంతేగానీ, సందేశాలు, నీతులు, సామాజిక స్పృహల కోసమే కథ రాయాలనుకోవద్దని సూచన.
పోటీకి వచ్చిన కథలలో ఉత్తమమైన కథలను ఎంపిక చేసి బహుమతులు అందచేస్తాం.
కథల నిడివిపై పరిమితి లేదు. ఒక్కొక్కరు ఎన్ని కథలనైనా పంపవచ్చు. కథకులకు వయసు పరిమితి లేదు. ఏ వయసులో వారైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు.
కథను టైప్ చేసి పంపితే సంతోషం. టైప్ చేయించి పంపేవారు పిడిఎఫ్‍తో పాటు ఓపెన్ ఫైల్ కూడా పంపాలి.
చేతి రాతతో పంపేవారు కథను చివరి తేదీ వరకూ ఆగకుండా కాస్త ముందుగానే పంపటం వాంఛనీయం!
***
నియమ నిబంధనలు:
- ఇంతకుముందు ఎక్కడా (ప్రింట్ పత్రికలలో కానీ, వెబ్ పత్రికలలో కానీ, వ్యక్తిగత బ్లాగులలో కానీ, ఫేస్బుక్/వాట్సప్ గ్రూపులలో కానీ) ప్రచురితం కాని కథలను మాత్రమే పోటీకి పంపాలి.
- ఇప్పటికే ఎక్కడైనా పరిశీలనలో ఉన్న రచనలు పోటీకి అనర్హం.
- పై అంశాలను ధృవీకరిస్తూ హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి.
- రచనకు ఏ కలం పేరు వాడినా రచయిత/రచయిత్రి అసలు పేరు తప్పనిసరిగా హామీ పత్రంలో రాయాలి.
- కథ అనువాదం, అనుకరణ, అనుసరణ కాదని హామీపత్రంలో స్పష్టం చేయాలి.
- ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా కథలు పంపవచ్చు.
- పోటీలో బహుమతి పొందిన ఏ కథనైనా, ఫలితాలు వెలువడిన తరువాత వెనక్కి తీసుకునే అవకాశం లేదని గమనించగలరు.
- బహుమతుల విషయంలో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
- కథల ప్రతులపై రచయిత/రచయిత్రి పేరు ఉండరాదు. విడిగా హామీపత్రంపై మాత్రమే పేరు, ఫోన్ నెంబరు, ఈ-మెయిల్ ఐడీ తప్పనిసరిగా రాయాలి.
- కథలు పంపవలసిన చివరి తేదీ 17/05/2026.
పంపాల్సిన విధానం:
మెయిల్ ద్వారా కథలు పంపాల్సిన చిరునామా – sanchikabvsraokathalapotee26@gmail.com మెయిల్ సబ్జెక్ట్ లైనులో బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026 కి అని వ్రాయాలి.
వాట్సప్ ద్వారా అయితే – 9849617392. బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026 కి అని వ్రాయాలి. వాట్సప్‌లో కథలు పంపినవారు తమ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తప్పక పేర్కొనాలి.
By Post (పోస్ట్ ద్వారా అయితే):
(గమనిక: పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా కథ కాపీ తమ దగ్గర వుంచుకోవాలి).
Sanchika Web Magazine
Plot no 32, H.No 8-48
Raghuram Nagar Colony.
Aditya Hospital lane
Dammaiguda, Hyderabad-500083
అనే చిరునామాకి పంపాలి. పోస్టల్ కవర్ మీద తప్పనిసరిగా బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026 కి అని వ్రాయాలి.
ఫలితాలు 07 జూన్ 2026 నాడు వెలువడతాయి. అనంతరం సంచిక వెబ్ పత్రికలో బహుమతి పొందిన కథలు, సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలూ వరుసగా ప్రచురితమవుతాయి.
బహుమతి ప్రదానోత్సవం బెహరా వెంకట సుబ్బారావు గారు నవతి ఉత్సవాల సందర్భంగా వారి పుట్టినరోజున విశాఖ రసజ్ఞ వేదిక, విశాఖపట్నం వారు 28 జూన్ 2026 న నిర్వహించే కార్యక్రమం నందు పెద్దల సమక్షంలో జరుపబడును.
