[‘భాగవతుల సేవ’ అనే పద్య కవితను అందిస్తున్నారు డా. బి. మల్లయా చారి.]
~
సీ.
భాగవతుల సేవ భగవంతుడే చేయు
సూక్ష్మధర్మమునందు మోక్షమిదియె
తనను నమ్మిన బాలు తరచు కష్టము జూచి
నరసింహుడై వెంట నడిచినాడు
దుర్వాసు రుషి శాప కర్మను శాసించి
అంబరీషుని భక్తి చాటినాడు
వయసు మళ్లిన తల్లి వరదీక్షగావెళ్ళి
శబరి మాతకు శాంతమిచ్చినాడు
పోరు సల్పెడి పార్థు వీర శక్తి గనిల్చి
విజయ కేతన మయ్యి వెలిగినాడు
గీ.
దేవదేవుని నమ్మిన దేహ మిదియె
జన్మ జన్మల బంధంబు మర్మమిదియె
సకల దేవుళ్ళు జన్మించు స్థాన మిదియె
అట్టి జన్మము పొందిన దిట్ట నేను
