[ఆగస్టు 13వ తేదీన ప్రముఖ నటి, దివంగత శ్రీదేవి జయంతి సందర్భంగా ‘భారత చలనచిత్ర ఠీవి శ్రీదేవి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నారు దిలీప్ కేతవరపు.]
ఆమె విలాస వరేణ్యము
వినోద శరణ్యము
అనన్య సామాన్యము
అఖండ ఆరాధనార్హము
నిరంతరము ప్రియాతిప్రియము
అభిమానులకు ‘శ్రీ’ తోడిదె లోకము
అఖిల భారత తొలి మహిళా మహా తార
శ్రీదేవి కాక మరెవరుర
ఇండియా భాగ్యమె భాగ్యము, భళి రా
