[బాలబాలికల కోసం – ‘బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ డా. సలీం అలీ – అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పక్షి శాస్త్రవేత్త, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా, పక్షి శాస్రవేత్త పితామహుడిగా పేరు పొందిన డా. సలీం అలీ గురించి తెలుసుకుందామా!
పద్మ విభూషణ్ పురస్కారాన్ని పొందిన అపూర్వ శాస్త్రవేత్త ఆయన. పక్షి శాస్త్రాన్ని ‘ఆర్నీతాలాజీ’ అంటారు. దీని గురించి విస్తృతమైన అధ్యయనం, నిరంతరం కృషి సల్పిన డా. సలీం అలీ వివరాలు పరిశీలిద్దాం.
‘సలీమ్ మొయిజూద్దీన్ అబ్దుల్ అలీ’ 1896వ సంవత్సరంలో నవంబర్ 12వ తేదీన భారతదేశంలోని ముంబయి నగరంలో జన్మించారు ఆ తర్వాత అమెరికాలోని మస్సాచ్యుసెట్స్ లోని బ్రూక్లిన్ ప్రాంతానికి మారారు. సలీం అలీ తన తల్లిదండ్రులకు పదవ సంతానం. సలీం అలీ చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు మరణించారు. మామయ్య అమీరుద్దీన్ త్యాబ్జీ వద్ద, హమీదా బేగం వద్ద సలీం అలీ పెరిగారు. బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ సెక్రటరీ అయినటువంటి వాల్టర్ శామ్యూల్ మిల్లార్ట్ సలీం ఆలీకి పక్షుల అధ్యయనం పట్ల స్ఫూర్తిని కలిగించాడు. పక్షుల గురించి వాటి సహజ సిద్ధ నివాస స్థలాల గురించి సలీం అలీ జీవిత కాలం కృషి చేశారు.
సలీం అలీ బాల్యం, విద్యాభ్యాసం ముంబయిలోనూ, బర్మాలోనూ కొనసాగింది. హైదరాబాద్, గాల్వియర్‌ల సంస్థానాధీశుల సహాయంతో పక్షుల పేర్లు, రకాల గురించి పరిశోధనలు చేశారు. అలాగే కొచ్చిన్, తిరువన్కూర్, ఇండోర్, భోపాల్ వంటి సంస్థనాలలోను పక్షులు నివాస స్థలాలు ఎలా ఏర్పరచుకుంటున్నాయి, వాటి ఆహార వివరాల గురించి ఎంతో అధ్యయనం చేశారు. జర్మనీలోని బెర్లిన్ విశ్వవిద్యాలయం వారి జూలాజికల్ మ్యూజియంలో పక్షుల అధ్యయనం గురించి మరింత లోతుగా తెలుసుకున్నారు. సలీం అలీ చేసిన కృషిలో ఆయన భార్య తెహమినా తోడుగా సహకరించారు. ఆ తర్వాత 1939లో అయన భార్య మరణించడంతో సోదరి బావ తోడుగా నిలబడ్డారు.
సలీం అలీ ‘ది ఫాల్ ఆఫ్ ఎ స్పారో’ అనే పేరుతో ఆత్మకథను రాసుకున్నారు. అందులో పసుపు గొంతు గల పిచ్చుక సంఘటన తన జీవితంలో గొప్ప మలుపు తిప్పిందని రాసుకున్నారు. ఈ సంఘటనే ఆయనని పక్షి శాస్త్రంలోకి ఆహ్వానించింది. తను పరిశీలించిన విషయాలన్నిటినీ సలీం ఒక డైరీలో పొందు పరుచుకునేవారు. ‘ద స్టడీ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’ అనే పుస్తకంపై హ్యూ విస్లర్ ఒక నోట్ ప్రచురించాడు. భారతదేశంలోని అనేక ప్రాంతాలను సర్వే చేసిన హ్యూ విస్లర్, సలీం అలీకి సహాయంగా ఉన్నాడు. గ్రేటర్ రాకెట్ టెయిల్ట్ డ్రోంగో అనే పక్షుల పొడవైన తోకల చివర ఉన్న రాకెట్లకు లోపలి వైపున వెబ్బింగ్ లేదని తెలియజెప్పాడు. దీనిని పొరపాటుగా గుర్తించిన సలీం అలీ ప్రారంభంలో ఇలాంటి పొరపాట్లు జరగడం సహజమని పేర్కొన్నారు. ఈ మాట విస్లర్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ తరువాత పరిశీలనలలో విస్లర్ తన తప్పును అంగీకరించి సలీంకు స్నేహితుడయ్యాడు.
సలీం అలీ తన ప్రయాణాలలో ఫిన్ యొక్క బయాలోని కుమాపూన్ టెరాయ్ జనాభాను కనుగొన్నారు. కానీ పర్వత పిట్టను కనుగొనే క్రమంలో విఫలమయ్యారు. పక్షుల వర్గీకరణ, వ్యవస్థాపన వంటి అంశాలలో అలీకి ఆసక్తి లేనందున విమర్శలకు గురయ్యారు. “సహజ వాతావరణంలో జీవించే పక్షి” పైన తనకు అమితమైన ఆసక్తి ఉన్నదని సలీం అలీ పేర్కొన్నారు.
‘జర్నల్ ఆఫ్ ద బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ’లో అనేక ప్రసిద్ధమైన వ్యాసాలు రాశారు. 1930లో సలీం అలీ ‘స్టాపింగ్ బై ద ఫుడ్స్ ఆన్ ఎ సండే మార్నింగ్’ అనే వ్యాసాన్ని రాశాడు. 1984లో ఈ వ్యాసం సలీం అలీ పుట్టిన రోజు నాడు ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ లో పునర్ముంద్రించబడింది. సలీం అలీ తన స్నేహితుడు పిల్లాన్ రిప్లీతో కలిసి “హ్యాండ్ బుక్ ఆఫ్ ద బర్డ్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్” పది సంపుటాల రచనను రాశారు. దీనిని రాయడానికి పది సంవత్సరాల కాలం పట్టింది. సలీం అలీ ఇచ్చిన రేడియో ప్రసంగాలను తారా గాంధీ సేకరించి సవరించారు. ఆయన రాసిన లేఖలను, రచనలను. తారా గాంధీ సంపాదకీయం చేశారు.
సలీం అలీ పక్షుల వేటకు వ్యతిరేకంగా ఉంటారు. పక్షుల వేట గురించి సలీం తన మాటలలో ఇలా తెలిపారు. “నేను పక్షులను ఉద్దేశపూర్వకంగా చంపడాన్ని అస్యహించుకుంటాను. దానిని విధ్వంసకర చర్యగా భావిస్తాను”. సలీం అలీ పొదుపుగా జీవించే శైలిని కలిగి ఉన్నారు. ఆయన ‘గ్రేట్ ఇండియన్ బస్టర్ట్’ను అంతరించిపోతున్న పక్షులుగా గుర్తించారు. సలీం అలీ బంధువులు చాలా మంది పక్షి శాస్త్ర అధ్యయనం పట్ల ఆసక్తి కనబరచారు. భారతదేశ ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు సలీం అలీ పక్షి పరిశోధనల పట్ల ప్రభావితమయ్యారు.
91 ఏళ్ళ వయస్సులో డా. సలీం అలీ ప్రోస్టేట్ క్యాన్సర్‌తో 1987లో బొంబాయిలో మరణించారు.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
