Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బుజ్జిగాడి బడి

[వాణి వేమవరపు గారు రచించిన ‘బుజ్జిగాడి బడి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

అమ్మానాన్నల దగ్గర మన బుజ్జిగాడు,
అందలమే ఎక్కాడు నేడు చూడు,
జారుతున్న లాగుని ఎత్తిపెట్టి పట్టాడు,
పలకే చేతబట్టి బడికే పరిగెత్తినాడు,
పీచు మిఠాయి కోసం దారంట పేచి లేదన్నాడు,
బూరల బాబాయికి వద్దని బుర్రే ఊపాడు,
ప్రక్క బెంచి పంకజాక్షిని పిలక పట్టి పీకకుండా,
పటిక బెల్లం తినమని పళ్లే ఇకిలించాడు,
మాస్టారి ప్రశ్నలకు మహా బదులే ఇచ్చాడు,
అమ్మ ఇచ్చిన నచ్చని అప్పచ్చిని ఆనందంగా తిన్నాడు,
నేలపై కాకుండా బడి అంతా ఆకాశమై ఎగిరాడు,
బుజ్జిగాడి కళ్ళల్లో అంతా మెరుపు నే చూశారు,
అర్థం కాక అందరూ వాడిని ఆత్రంగా అడిగారు,
“రేపటినుండి బడికి సెలవులు కదా” అని పలికి
ఆనందంగా తుర్రుమన్నాడు.

Exit mobile version