Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చీమ సందేశం

[శ్రీ రేడియమ్ రచించిన ‘చీమ సందేశం’ అనే కవితని అందిస్తున్నాము]

రాచిలుక పలుకులు
ఆకలి తీర్చవు

నాగమణి వెలుగులు
చీకటి బతుకుల్లో
వెలుగులు నింపవు

గూబ సంగీతం
ఉదయాన్ని మేల్కొల్పదు..

చీమ చిన్నదే
సమష్టి పోరు నేర్పుతుంది

కూడు గూడు నీడ
మార్గం చూపుతుంది

Exit mobile version