[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘చెలిమి సుగంధాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆనంద సంబరాలహేల
అనుబంధాలు కలబోసుకుంటున్న
ఆత్మీయ మిత్రుల కలయిక
చదువుకున్న చిన్ననాటి ముచ్చట్లు
కాకెంగిలితో తిన్న తాయిలాలు
కళాశాలలో ఆడిన ఆటలు
అమ్మాయిలతో చేసిన రొమాన్స్లు
అధ్యాపకులకు చెప్పిన అబద్ధాల మాటలు
అన్నీ అన్నీ గుర్తుచేసుకుంటూ తలచుకుంటూ
ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటూ
వయస్సును మరిచిపోయిన పసివారై
మళ్లీ యవ్వనంలోకి అడుగుమోపినట్లుగా
ఆనాటి రోజులు తలుచుకుంటూ
పాటలుపాడి మాటలుచెప్పి ఆటలుఆడి
అనుభవాలతో పండిన వయస్సును
ఆలోచనలతో నిండిన మనసును
ఒకరికొకరు పంచుకుంటూ
మనం ఒకరికోసం ఒకరి మనుకొంటూ
తోటలోని పూలు సువాసనలు వెదజల్లితే
మిత్రుల సమ్మేళనములో
విరిసిన చెలిమి పరిమళ గంధాలను
మనసు నిండా అలదుకుంటూ
మళ్లీ మనమంతా కలవాలని
కళ్ళతోనే వీడుకొలుపుతూ
మాటలే లేని మౌనభాషలతో
గుండెల నిండా నిండిన ఆనందాలతో
శరీరానికే కానీ వయస్సు మనసుకులేదన్న
కవి మాటలను రుజువు చేసిన
ఆట పాటలను తలచుకుంటూ
ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ
అడుగులు కదిపారు అందరూ.
