Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-10

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. సోనిక్ ఓమి సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘ధర్మ’ లోని ‘ఇషారోం సే కహ్‌దో రాజ్ కో రోజ్ ఆనే దో’ పాటకి అనుకరణగా ఉన్నది – సత్యం స్వరాలు కూర్చిన ‘ నా పేరే భగవాన్’ సినిమా లోని ఏ పాట?
  2. ఎం.ఎస్. విశ్వనాథన్ స్వరాలందించిన ‘రాము’ అనే తమిళ సినిమాలోని ‘నిలవే ఎన్నిడం నిలయాదా’ పాటకి అనుకరణగా ఉన్నది – ఆర్. గోవర్ధనం సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘రాము’ సినిమా లోని ఏ పాట?
  3. విజయ భాస్కర్ స్వరాలందించిన ‘వసంత లక్ష్మి’ అనే కన్నడ సినిమాలోని ‘బెళ్లి మోడవే ఎల్లి ఓదువే’ పాటకి అనుకరణగా ఉన్నది – కె. విజయ భాస్కర్ సంగీత దర్శకత్వం వహించిన ‘అమ్మాయిల శపథం’ సినిమా లోని ఏ పాట?
  4. కె. వి. మహదేవన్ స్వరాలందించిన ‘కుముదం’ అనే తమిళ సినిమాలోని ‘ఎన్నవీట్టు ఓదిపోవు ముడియుమా’ పాటకి అనుకరణగా ఉన్నది – కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ‘మంచి మనసులు’ సినిమా లోని ఏ పాట?
  5. కె. వి. మహదేవన్ స్వరాలందించిన ‘శారద’ అనే తమిళ సినిమాలోని ‘కణ్ణా నానూ నిలవాదే’ పాటకి అనుకరణగా ఉన్నది – కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘సుమంగళి’ సినిమా లోని ఏ పాట?
  6. దత్తారాం స్వరాలందించిన ‘ఖైదీ నెంబర్ 911’ అనే హిందీ సినిమాలోని ‘మీఠీ మీఠీ బాతోంసే బచ్‌నా జరా’ పాటకి అనుకరణగా ఉన్నది – ఘంటసాల స్వరాలు కూర్చిన ‘శాంతినివాసం’ (అక్కినేని) సినిమా లోని ఏ పాట?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మార్చ్ 31వ  తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-9 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఏప్రిల్ 05వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-8 జవాబులు:

  1. గులాబీలు పూచే వేళ
  2. ఓ నా రాజా రావా రావా
  3. మల్లెపువ్వులు, ఈ పిల్ల నవ్వులు
  4. నీలాల నింగి ఎగిసిపడే నిండు చందురుడా
  5. అన్నా అన్నా విన్నావా
  6. పూలు గుసగుసలాడేనని

~

చెప్పుకోండి చూద్దాం-8కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version