Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-11

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. ఎం.ఎస్. విశ్వనాథన్ స్వరాలందించిన ‘ఎంగవూరు రాజా’ అనే తమిళ సినిమాలోని ‘యారిక్కె నంబి’ పాటకి అనుకరణగా ఉన్నది – టి. చలపతిరావు సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ధర్మదాత’ సినిమా లోని ఏ పాట?
  2. ఎస్.డి. బర్మన్ సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘తేరే ఘర్ కే సామ్‌నే’ లోని ‘మానేనా మేరా దిల్ దీవానా’ పాటకి అనుకరణగా ఉన్నది – కోటి స్వరాలు కూర్చిన ‘నువ్వే నువ్వే’ సినిమా లోని ఏ పాట?
  3. కళ్యాణ్‌జీ – ఆనంద్‌జీ స్వరాలందించిన ‘గీత్’ అనే హిందీ సినిమాలోని ‘ఆజా తుజ్ కో పుకారే మేరే గీత్ రే’ పాటకి అనుకరణగా ఉన్నది – ఎస్. హనుమంతరావు స్వరాలు కూర్చిన ‘ఆరాధన’ (ఎన్.టి.ఆర్.) సినిమా లోని ఏ పాట?
  4. ఎస్.డి. బర్మన్ సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘ఆరాధన’ (రాజేష్ ఖన్నా) లోని ‘రూప్ తేరా మస్తానా’ పాటకి అనుకరణగా ఉన్నది – ఎస్. రాజేశ్వరరావు స్వరాలు కూర్చిన ‘మనుషులంతా ఒక్కటే’ సినిమా లోని ఏ పాట?
  5. ఎస్. విశ్వనాధన్ – రామ్మూరి స్వరాలందించిన ‘నెంజిల్ ఒరు ఆలయం’ అనే తమిళ సినిమాలోని ‘నినవదెల్లాం నడుందవిట్టా దైవం ఏరుమిల్లే’ పాటకి అనుకరణగా ఉన్నది – ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించిన ‘మనసే మందిరం’ సినిమా లోని ఏ పాట?
  6. శంకర్-జైకిషన్ స్వరాలందించిన ‘చోరీ చోరీ’ (రాజ్‍ కపూర్) అనే హిందీ సినిమాలోని ‘రసిక్ బల్‍మా’ పాటకి అనుకరణగా ఉన్నది – మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘నిండు సంసారం’ సినిమా లోని ఏ పాట?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఏప్రిల్ 07వ  తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-11 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఏప్రిల్ 12వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-9 జవాబులు:

  1. ఓరబ్బీ వేసుకున్నా కిళ్ళీ
  2. ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం
  3. మంగమ్మా, నువ్వు ఉతుకుతుంటే అందం
  4. ఓ ఓ ప్రియతమా రావా
  5. గాయపడినా ప్రేమికా
  6. పిలచిన నా రాజు రాలేడనో

~

చెప్పుకోండి చూద్దాం-9 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version