Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-12

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. సి. రామచంద్ర సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘ఆజాద్’ (దిలీప్ కుమార్) లోని ‘నా బోలే నా బోలే నా బోలే రే’ పాటకి అనుకరణగా ఉన్నది – అద్దేపల్లి/టి.వి.రాజు స్వరాలు కూర్చిన ‘చింతామణి’ సినిమా లోని ఏ పాట?
  2. మదన్ మోహన్ స్వరాలందించిన ‘ఓ కౌన్ థీ’ అనే హిందీ సినిమాలోని ‘శోక్ నజర్ కే బిజిలియా’ పాటకి అనుకరణగా ఉన్నది – వేదా స్వరాలు కూర్చిన ‘ఆమె ఎవరు’ సినిమా లోని ఏ పాట?
  3. సలీల్ చౌదురి సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘మధుమతి’ లోని ‘ఓ దయ్యారె దయ్యారె దడో గయి పాపి బిభువా’ పాటకి అనుకరణగా ఉన్నది – టి.వి.రాజు స్వరాలు కూర్చిన ‘గండికోట రహస్యం’ సినిమా లోని ఏ పాట?
  4. హేమంత్ కుమార్ స్వరాలందించిన ‘ఏక్ హీ రాస్తా’ అనే హిందీ సినిమాలోని ‘సావులి సలోనా లేకే’ పాటకి అనుకరణగా ఉన్నది – మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘కుంకుమరేఖ’ సినిమా లోని ఏ పాట?
  5. హేమంత్ కుమార్ స్వరాలందించిన ‘నాగిన్’ (వైజయంతిమాల) అనే హిందీ సినిమాలోని ‘మన్ డోలె మెరా తన్ డోలే’ పాటకి అనుకరణగా ఉన్నది – పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘భాగ్యరేఖ’ సినిమా లోని ఏ పాట?
  6. వేదా స్వరాలందించిన ‘అదే కన్గల్’ అనే తమిళ సినిమాలోని ‘పొంబళ ఒరుత్తి’ పాటకి అనుకరణగా ఉన్నది – వేదా సంగీత దర్శకత్వం వహించిన ‘అవే కళ్ళు’ సినిమా లోని ఏ పాట?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఏప్రిల్ 14వ  తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-12 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఏప్రిల్ 19వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-10 జవాబులు:

  1. మేడలో ఉన్న చిలకమ్మా
  2. మంటలు లేపే ఓ నెలరాజా
  3. నీలి మేఘమా జాలి చూపుమా
  4. నన్ను వదిలి నీవు పోలేవులే
  5. కన్నులు నీవే కావాలి
  6. ఆశలు తీర్చవే ఓ జననీ

~

చెప్పుకోండి చూద్దాం-10 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version