Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-13

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. రవి సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘చైనా టౌన్’ లోని ‘దేఖో జీ ఏకా బాలా జోగి’ పాటకి అనుకరణగా ఉన్నది – టి.వి.రాజు స్వరాలు కూర్చిన ‘భలే తమ్ముడు’ (ఎన్.టి.ఆర్.) సినిమా లోని ఏ పాట?
  2. ఆర్.డి. బర్మన్ స్వరాలందించిన ‘సమాధి’ అనే హిందీ సినిమాలోని ‘కాంటా లగా బంగ్లే కీ పీఛే తేరీ’ పాటకి అనుకరణగా ఉన్నది – ఎస్. రాజేశ్వరరావు స్వరాలు కూర్చిన ‘బంగారు కలలు’ సినిమా లోని ఏ పాట?
  3. రవి సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘వక్త్’ లోని ‘కౌన్ ఆయా కి నిగాహోంమే చమక్ జాగ్ ఉఠీ’ పాటకి అనుకరణగా ఉన్నది – ఘంటసాల స్వరాలు కూర్చిన ‘భలే అబ్బాయిలు’ సినిమా లోని ఏ పాట?
  4. ఆర్.డి. బర్మన్ స్వరాలందించిన ‘యాదోం కీ బారాత్’ అనే హిందీ సినిమాలోని ‘యాదోం కీ బారాత్ నిక్లీ హై’ పాటకి అనుకరణగా ఉన్నది – చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమా లోని ఏ పాట?
  5. శంకర్-జైకిషన్ స్వరాలందించిన ‘లాట్ సాహెబ్’ అనే హిందీ సినిమాలోని ‘తన్ మే అగ్ని మన్ మే చుభన్’ పాటకి అనుకరణగా ఉన్నది – విజయాకృష్ణమూర్తి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘అగ్గివీరుడు’ సినిమా లోని ఏ పాట?
  6. నౌషాద్ స్వరాలందించిన ‘బడా భాయి’ అనే హిందీ సినిమాలోని ‘చోరీ చోరీ దిల్ కా లగ్నా బురీ బాత్ హై’ పాటకి అనుకరణగా ఉన్నది – ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘శభాష్ రాముడు’ సినిమా లోని ఏ పాట?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఏప్రిల్ 21వ  తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-13 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఏప్రిల్ 26వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-11 జవాబులు:

  1. ఎవ్వరికోసం ఎవరున్నారు పొండిరా పొండి
  2. అందరినీ వెంటపడి అడగాలా
  3. నా మది నిన్ను పిలిచింది గానమై
  4. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా
  5. తలచినదే జరిగినదా దైవం ఎందులకు?
  6. దేవుడున్నాడా

~

చెప్పుకోండి చూద్దాం-11 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version