Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-14

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. కళ్యాణ్‍జీ – ఆనంద్‌జీ సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘జంజీర్’ లోని ‘యారీ హై ఈమాన్ మేరా’ పాటకి అనుకరణగా ఉన్నది – సత్యం స్వరాలు కూర్చిన ‘నిప్పులాంటి మనిషి’ (ఎన్.టి.ఆర్.) సినిమా లోని ఏ పాట?
  2. రవి సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘ఉస్తాందో కా ఉస్తాద్’ లోని ‘సౌ బార్ జనమ్ లేంగే’ పాటకి అనుకరణగా ఉన్నది – వేదా స్వరాలు కూర్చిన ‘మొనగాళ్ళకు మొనగాడు’ సినిమా లోని ఏ పాట?
  3. ఎస్.డి. బర్మన్ స్వరాలందించిన ‘షర్మీలీ’ అనే హిందీ సినిమాలోని ‘ఖిల్‌తే హైఁ గుల్ యహాఁ’ పాటకి అనుకరణగా ఉన్నది – టి.వి. రాజు స్వరాలు కూర్చిన ‘ధనమా దైవమా’ సినిమా లోని ఏ పాట?
  4. కె.వి. మహదేవన్ స్వరాలందించిన ‘శారద’ అనే తమిళ సినిమాలోని ‘ఒరుత్తి ఒరువనై’ పాటకి అనుకరణగా ఉన్నది – కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘సుమంగళి’ (అక్కినేని) సినిమా లోని ఏ పాట?
  5. కె.వి. మహదేవన్ స్వరాలందించిన ‘కుముదం’ అనే తమిళ సినిమాలోని ‘మామ మామా మామా’ పాటకి అనుకరణగా ఉన్నది – కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘మంచి మనసులు’ సినిమా లోని ఏ పాట?
  6. విశ్వనాథన్ – రామ్మూర్తి స్వరాలందించిన ‘పాశమలర్’ అనే తమిళ సినిమాలోని ‘వారాయి తోళి వారాయో’ పాటకి అనుకరణగా ఉన్నది – ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘రక్త సంబంధం’ (ఎన్.టి.ఆర్) సినిమా లోని ఏ పాట?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఏప్రిల్ 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-14 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మే 03వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-12 జవాబులు:

  1. రావోయి రావోయి ఓ మాధవా
  2. నీవు చూపే చూపులు ఎన్నో అర్థాలు
  3. వయ్యారి వయ్యారి వయ్యారి భామ వచ్చింది
  4. తీరేను కోరిక తీయ తీయగా
  5. మనసూగే సఖ, తనువూగే ప్రియ
  6. మా ఊళ్ళో ఒక పడుచుంది

~

చెప్పుకోండి చూద్దాం-12 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version