[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.
కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.
వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.
శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.
~
ప్రశ్నలు:
- విజయ భాస్కర్ సంగీత దర్శకత్వం వహించిన కన్నడ సినిమా ‘శరపంజర’ లోని ‘కావేరీ కొడిగిన కావేరీ’ పాటకి అనుకరణగా ఉన్నది – విజయ భాస్కర్ స్వరాలు కూర్చిన ‘కృష్ణవేణి’ సినిమా లోని ఏ పాట?
- మదన్ మోహన్ సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘ఔ కౌన్ థీ’ లోని ‘లగ్‍జా గలే ఫిర్ ఏ హసీనా రాత్’ పాటకి అనుకరణగా ఉన్నది – వేదా స్వరాలు కూర్చిన ‘ఆమె ఎవరు’ సినిమా లోని ఏ పాట?
- జి.కె. వెంకటేష్ స్వరాలందించిన ‘తాయిదేవరు’ అనే కన్నడ సినిమాలోని ‘హాగయదె దిన మన’ పాటకి అనుకరణగా ఉన్నది – జి.కె. వెంకటేష్ స్వరాలు కూర్చిన ‘జమీందారు గారి అమ్మాయి’ సినిమా లోని ఏ పాట?
- రాజన్ నాగేంద్ర స్వరాలందించిన ‘హోంబిసిలు’ అనే కన్నడ సినిమాలోని ‘జీవ వీణ నీదు’ పాటకి అనుకరణగా ఉన్నది – రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ఇంటింటి రామాయణం’ సినిమా లోని ఏ పాట?
- జి.కె. వెంకటేష్ స్వరాలందించిన ‘సొసె తంద సౌభాగ్య’ అనే కన్నడ సినిమాలోని ‘రవివర్మదా కుంచెదా’ పాటకి అనుకరణగా ఉన్నది – జి.కె. వెంకటేష్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘రావణుడే రాముడైతే’ సినిమా లోని ఏ పాట?
- రాజన్ నాగేంద్ర స్వరాలందించిన ‘ఎరడు కనసు’ అనే కన్నడ సినిమాలోని ‘పూజిసలిందే హూగుల తందే’ పాటకి అనుకరణగా ఉన్నది – రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వం వహించిన ‘పూజ’ సినిమా లోని ఏ పాట?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మే 05వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-15 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మే 10వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
చెప్పుకోండి చూద్దాం-13 జవాబులు:
- గోపాల బాలా నిన్నే కోరి
- నాలోనా వలపుంది
- ఎవరో ఈ వేళ
- ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే
- లేడి కన్నులు నీవైతే
- కలకల విరిసె జగాలే పులకించెలె
~
చెప్పుకోండి చూద్దాం-13 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి. వి. రాజు, హైదరాబాద్
- ఆర్. రఘునాథరావు, ఆదోని
- జాకీర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగళూరు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- సునీతా ప్రకాశ్, బెంగుళూరు
గమనిక:
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
