Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-16

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. చిత్రగుప్త సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘భాభి’ లోని ‘చల్ చల్ రే పతం మెరీ చలీ రే’ పాటకి అనుకరణగా ఉన్నది – మాస్టర్ వేణు స్వరాలు కూర్చిన ‘కులదైవం’ సినిమా లోని ఏ పాట?
  2. ఓ.పి.నయ్యర్ సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘ఫిర్ వహీ దిల్ లాయా హూఁ’ లోని ‘నజీన్ బడా రంగీన్ హై వాద్ తేరా’ పాటకి అనుకరణగా ఉన్నది – రాజన్ నాగేంద్ర స్వరాలు కూర్చిన ‘నవగ్రహ పూజా మహిమ’ సినిమా లోని ఏ పాట?
  3. ఎ. ఎమ్. రాజా స్వరాలందించిన ‘కళ్యాణ పరిసు’ అనే తమిళ సినిమాలోని ‘తుళ్ళార మనమున తుళ్ళుం’ పాటకి అనుకరణగా ఉన్నది – ఎ. ఎమ్. రాజా స్వరాలు కూర్చిన ‘పెళ్ళికానుక’ (అక్కినేని) సినిమా లోని ఏ పాట?
  4. విశ్వనాథన్-రామ్మూర్తి స్వరాలందించిన ‘నెంజిల్ ఒరు ఆలయం’ అనే తమిళ సినిమాలోని ‘ముత్తానా ముత్తల్లవో’ పాటకి అనుకరణగా ఉన్నది – ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘మనసే మందిరం’ సినిమా లోని ఏ పాట?
  5. విశ్వనాథన్-రామ్మూర్తి స్వరాలందించిన ‘వాళ్ళాయ్ పడగు’ అనే తమిళ సినిమాలోని ‘చిన్న చిన్న కణ్ణనిక్కు ఎన్నదాన్ పున్నగయో’ పాటకి అనుకరణగా ఉన్నది – విశ్వనాథన్-రామ్మూర్తి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ఆడబ్రతుకు’ సినిమా లోని ఏ పాట?
  6. కె.వి. మహదేవన్ స్వరాలందించిన ‘పడిక్కాడమేదై’ అనే తమిళ సినిమాలోని ‘బరే బరే మారిలే బరే బరు రాజా’ పాటకి అనుకరణగా ఉన్నది – కె.వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ‘ఆత్మబంధువు’ సినిమా లోని ఏ పాట?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మే 12వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-16 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మే 17వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-14 జవాబులు:

  1. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం
  2. నేనున్నది నీ కోసం
  3. నీ మది చల్లగా స్వామీ నిదురపో
  4. కనులు కనులతో కలబడితే
  5. మామ మామా మామా
  6. బంగారు బొమ్మ రావేమే

~

చెప్పుకోండి చూద్దాం-14 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version