Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-17

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

నలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘ఎంగ ఊరు పట్టాకరన్’ లోని ‘మదుర మరికొళందు’ పాటకి అనుకరణగా ఉన్నది – ఇళయరాజా స్వరాలు కూర్చిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా లోని ఏ పాట?
  2. సిర్పి సంగీత దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘నాట్టామై’ లోని ‘కొట్టాపాక్కుం’ పాటకి అనుకరణగా ఉన్నది – కోటి స్వరాలు కూర్చిన ‘పెదరాయుడు’ సినిమా లోని ఏ పాట?
  3. ఇళయరాజా స్వరాలందించిన ‘భద్రకాళి’ అనే తమిళ సినిమాలోని ‘కణ్ణన్ ఒరు కైకొళందై’ పాటకి అనుకరణగా ఉన్నది – ఇళయరాజా స్వరాలు కూర్చిన ‘భద్రకాళి’ సినిమా లోని ఏ పాట?
  4. ఎస్. ఎ. రాజ్‍కుమార్ స్వరాలందించిన ‘తుళ్ళాడ మనమున్ తుళ్ళుం’ అనే తమిళ సినిమాలోని ‘ఇరువది కోడి నిలువద’ పాటకి అనుకరణగా ఉన్నది – ఎస్. ఎ. రాజ్‍కుమార్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు వస్తావని’ సినిమా లోని ఏ పాట?
  5. ఇళయరాజా స్వరాలందించిన ‘ధర్మదురై’ అనే తమిళ సినిమాలోని ‘మాసీ మాసమా అలన పొన్ను’ పాటకి అనుకరణగా ఉన్నది – ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ధర్మక్షేత్రం’ సినిమా లోని ఏ పాట?
  6. ఎస్. ఎ. రాజ్‍కుమార్ స్వరాలందించిన ‘సూర్యవంశం’ అనే తమిళ సినిమాలోని ‘రోసాప్పూ చిన్ని రోసాప్పూ’ పాటకి అనుకరణగా ఉన్నది – ఎస్. ఎ. రాజ్‍కుమార్ సంగీత దర్శకత్వం వహించిన ‘సూర్యవంశం’ సినిమా లోని ఏ పాట?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మే 19వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-17 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మే 24వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-15 జవాబులు:

  1. కృష్ణవేణి తెలుగింటి విరిబోణి
  2. అందాల ఈ రేయి
  3. మోగింది వీణ పదే పదే
  4. వీణ వేణువైన సరిగమ విన్నావా
  5. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
  6. పూజలు చేయ పూలు తెచ్చాను

~

చెప్పుకోండి చూద్దాం-15 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version