Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-18

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. తమిళ చిత్రం ‘కడలోర కవితై గళ్’ చిత్రంలోని పాట ‘అడి అమ్మాడీ, అడి అత్తాజీ’ పాటకు సంగీతం ఇళయరాజా. ఈ పాటను తెలుగులో ‘ఆరాధన’ (చిరంజీవి) చిత్రంలో ఏ పాటగా అనుకరించారు?
  2. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నిలవు సుధువాథిల్లయ్’ లోని పాట ‘నాలుం ఎన్ మనమ్’ను తెలుగులో ‘అభినందన’ చిత్రంలో ఏ పాటగా అనువదించారు?
  3. విజయకాంత్, రాధ నటించిన ‘అమ్మణ్ కోయిల్ కిళకలె’ చిత్రంలోని ‘చిన్నా మణి కోయిలే’ పాటను తెలుగులో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ‘చెట్టు కింద ప్లీడరు’ చిత్రంలో ఏ పాటగా అనువదించారు?
  4. అజిత్, సిమ్రాన్‌లు నటించిన చిత్రం ‘అవళ్ వరువాల’ లోని ‘కాదల్ ఎన్న’ పాటను తెలుగులో ‘పెళ్లి’ చిత్రానికి A. రాజ్ కుమార్ ఏ పాటగా అనువదించారు? –
  5. ‘అమరగానం’ తమిళ చిత్రం లోని పాట ‘బరే రాగం, బరే తాళం’ పాటను ఇళయరాజా ‘అభినందన’ చిత్రంలో ఏ పాటగా మలిచారు?
  6. తమిళ చిత్రం ‘వానత్థై పోలా’ లోని ‘మయినా మయినావే’ పాటను సంగీతదర్శకుడు A. రాజ్ కుమార్ తెలుగులో ‘మా అన్నయ్య’ చిత్రంలో ఏ పాటగా మలిచారు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మే 26వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-18 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మే 31వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-16 జవాబులు:

  1. పదపదవె వయ్యారి గాలిపటమా
  2. ఎవ్వరో ఎందుకీ రీతి సాధింతురో
  3. పులకించని మది పులకించు
  4. అల్లారు ముద్దుకదే
  5. బుజ్జి బుజ్జి పాపాయి
  6. అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

~

చెప్పుకోండి చూద్దాం-16 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version