Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-19

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘అలైగళ్ ఓవదిల్లై’ చిత్రంలోని ‘ఆయిరం తామరై’ పాటని తెలుగులో ‘సీతాకోకచిలుక’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  2. తమిళ చిత్రం ‘పాశమలర్’ లోని ‘వారాయి తోళి వా రాయో’ పాటకు సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి. దీనిని తెలుగులో సంగీత దర్శకుడు ఘంటసాల, ఎన్.టి.ఆర్. సావిత్రిల ‘రక్తసంబంధం’ చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?
  3. ‘రోటీ’ అనే హిందీ సినిమాలోని ‘యార్ హమారీ బాత్ సునో’ పాటను లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వరపర్చగా, దీనిని తెలుగులో సత్యం సంగీత దర్శకత్వం వహించిన ‘నేరం నాది కాదు ఆకలిది’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  4. ‘షెన్‌బాగమే షెన్‌బగమే’ అనే తమిళ చిత్రంలోని ‘మంజిపోడి తెక్కయిల్’ పాటని ఇళయరాజా స్వరపరిచారు. దీనిని తెలుగులో ఇళయరాజా సంగీతదర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ (1987) సినిమాలో ఏ పాటగా వాడారు?
  5. ‘16 వయదనిలే’ అనే తమిళ చిత్రంలో ఇళయరాజా స్వరపరిచిన ‘సిందూర పూవే’ పాటని, తెలుగులో ‘16 ఏళ్ళ వయసు’ చిత్రం కోసం చక్రవర్తి ఏ పాటగా ఉపయోగించారు?
  6. తమిళ చిత్రం ‘ఆలయమణి’ లోని ‘”మానట్టం తంగ మయిలట్టం’ పాటకు సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి. దీనిని తెలుగులో సంగీత దర్శకుడు ఘంటసాల, ‘గుడిగంటలు’ చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూన్ 05వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-19 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 జూన్ 07వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-17 జవాబులు:

  1. యమహో నీ యమా యమా అందం
  2. బావవు నీవు, భామను నేను
  3. చిన్ని చిన్ని కన్నయ్యా
  4. కలలోనైనా కలగనలేదే
  5. ఎన్నో రాత్రులొస్తాయి గానీ
  6. రోజావే చిన్ని రోజావే

~

చెప్పుకోండి చూద్దాం-17 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version