Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-2

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. టివి రాజు సంగీత దర్శకత్వం వహించిన ‘భలే తమ్ముడు’ సినిమాలోని ‘ఎంతవారు గాని వేదాంతులైన గాని’ పాటకి రవి స్వరాలు కూర్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాట మూలం?
  2. మాస్టర్ వేణు స్వరాలందించిన ‘జల్సారాయుడు’ సినిమాలోని ‘అందాల సీమలో, చందమామ కాంతిలో’ పాట ఎన్. దత్తా సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?
  3. ఆర్. సుదర్శనం స్వరపరిచిన ‘జీవితం’ (వైజయంతిమాల) సినిమాలోని ‘చక్కనైన కోయారాజును ఎక్కడైనా చూశారా’ పాటకి సి. రామచంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఏ హిందీ సినిమా లోని ఏ పాట మూలం?
  4. రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వం వహించిన ‘ఖైదీ కన్నయ్య’ సినిమాలోని ‘తీయ తీయని మాటలతో తీస్తారు సుమా గోతులు’ పాట శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?
  5. ఆదినారాయణరావు స్వరపరిచిన ‘అనార్కలి’ సినిమాలోని ‘జీవితమే సఫలము, రాగసుధాభరితము’ పాట సి. రామచంద్ర సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాట మూలం?
  6. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘శభాష్ రాముడు’ సినిమాలోని ‘హలో డార్లింగ్ మాటాడవా, మురిపిస్తాం మురిపిస్తాం’ పాట ఓ.పి.నయ్యర్ స్వరాలు కూర్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఫిబ్రవరి 03వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-2 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఫిబ్రవరి 08వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

Exit mobile version