Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-21

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. ‘సుబహ్ కా తారా’ అనే హిందీ సినిమాలోని ‘గయా అంధేరా హువా ఉజియారా’ పాటను సి. రామచంద్ర స్వరపర్చగా, దీనిని తెలుగులో సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించిన ‘సంతానం’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  2. ‘ఉస్తాదోం కే ఉస్తాద్’ అనే హిందీ సినిమాలోని ‘సౌ బార్ జనమ్ లేంగే’ పాటను రవి స్వరపర్చగా, దీనిని తెలుగులో వేదా సంగీత దర్శకత్వం వహించిన ‘మొనగాళ్ళకు మొనగాడు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  3. ‘రోటీ’ అనే హిందీ సినిమాలోని ‘ఏ జో పబ్లిక్ హై సాబ్’ పాటను లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వరపర్చగా, దీనిని తెలుగులో సత్యం సంగీత దర్శకత్వం వహించిన ‘నేరం నాది కాదు ఆకలిది’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  4. ‘తుళ్ళాద మనమున్ తుళ్ళుం’ అనే తమిళ సినిమాలోని ‘ఇన్నై పాదు వరమ్’ పాటను, తెలుగులో ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీత దర్శకత్వం వహించిన ‘నువ్వు వస్తావని’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  5. తమిళ చిత్రం ‘చిన్నతంబి’ లోని ‘అరచ్చ సంతానం’ పాటకు సంగీతం ఇళయారాజా. దీనిని తెలుగులో ‘చంటి’ చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?
  6. ‘పాశం’ అనే తమిళ చిత్రంలోని ‘ఉలగం పిరందధు ఎనక్కాగ’ పాటని విశ్వనాథన్ రామ్మూరి స్వరపరిచారు. దీనిని తెలుగులో విశ్వనాథన్ రామ్మూరి సంగీతదర్శకత్వంలో వచ్చిన ‘మంచి చెడు’ సినిమాలో ఏ పాటగా వాడారు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూన్ 16వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-21 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 జూన్ 21వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-19 జవాబులు:

  1. మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
  2. బంగారు బొమ్మ రావేమే
  3. మంచిని సమాధి చేస్తారా?
  4. మాట రాని మౌనమిది
  5. సిరిమల్లె పూవా! సిరిమల్లె పూవా!
  6. దూరానా నీలి మేఘాలు

~

చెప్పుకోండి చూద్దాం-19 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version