[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.
కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.
వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.
శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.
~
ప్రశ్నలు:
- ‘అవల్ వరువాళ’ అనే తమిళ చిత్రంలోని ‘ఓ వందదు పెన్న’ పాటని ఎస్. ఎ. రాజ్‌కుమార్ స్వరపరిచారు. దీనిని తెలుగులో ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతదర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళి’ సినిమాలో ఏ పాటగా వాడారు?
- తమిళ చిత్రం ‘చిన్నతంబి’ లోని ‘కుయిల పుడిచ్చి’ పాటకు సంగీతం ఇళయారాజా. దీనిని తెలుగులో ‘చంటి’ చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?
- ‘కడలోరా కవితైగళ్’ అనే తమిళ చిత్రంలోని ‘కొడియిలె మల్లియ పూ’ పాటని ఇళయరాజా స్వరపరిచారు. దీనిని తెలుగులో ఇళయరాజా సంగీతదర్శకత్వంలో వచ్చిన ‘ఆరాధన’ (చిరంజీవి) సినిమాలో ఏ పాటగా వాడారు?
- ‘తుళ్ళాద మనమున్ తుళ్ళుం’ అనే తమిళ సినిమాలో ఎస్. ఎ. రాజ్‌కుమార్ స్వరకల్పన చేసిన ‘మేఘమాయె వందు’ పాటను, తెలుగులో ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీత దర్శకత్వం వహించిన ‘నువ్వు వస్తావని’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘సూర్యవంశం’ అనే తెలుగు సినిమాలోని ‘కిలకిలనవ్వే’ పాటని ఎస్. ఎ. రాజ్‌కుమార్ ‘తుళ్ళాద మనమున్ తుళ్ళుం’ అనే తమిళ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘చైనా టౌన్’ అనే హిందీ సినిమాలోని ‘యమ్మా యమ్మా యమ్మా’ పాటను రవి స్వరపర్చగా, దీనిని తెలుగులో టి.వి.రాజు సంగీత దర్శకత్వం వహించిన ‘భలే తమ్ముడు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూన్ 23వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘చెప్పుకోండి చూద్దాం-22 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 జూన్ 28వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
చెప్పుకోండి చూద్దాం-20 జవాబులు:
- ఆగిపో ఆగిపో కాలమా!
- ఎన్నెన్నో అందాలు
- రుక్కు రుక్కు రుక్కుమణి రమణి సద్గుణమణి
- రంగులలో కలవో
- చుక్కలు తెమ్మన్నా తెంపుకురానా
- హైదరాబాదు బుల్ బుల్, చార్మినార్ చంచల్
~
చెప్పుకోండి చూద్దాం-20 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- జాకీర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
- రామలింగయ్య టి, అంగలకుదురు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, దావణగొరె
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
గమనిక:
- ఈ క్విజ్కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
