[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.
కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.
వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.
శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.
~
ప్రశ్నలు:
- ‘షాగిర్ద్’ అనే హిందీ సినిమాలోని ‘దిల్ విల్ ప్యార్ ప్యార్’ పాటను లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వరపర్చగా, దీనిని తెలుగులో మాస్టర్ వేణు సంగీత దర్శకత్వం వహించిన ‘బొమ్మలు చెప్పిన కథ’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ అనే హిందీ సినిమాలోని ‘నైన్ సే నైన్ నహీ మిలావో’ పాటను వసంత్ దేశాయ్ స్వరపర్చగా, దీనిని తెలుగులో టి.వి.రాజు సంగీత దర్శకత్వం వహించిన ‘రాజనందిని’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘ఏక్ హీ రాస్తా’ అనే హిందీ సినిమాలోని ‘సాఁవలే సలోనే ఆయె దిన్’ పాటను హేమంత్ కుమార్ స్వరపర్చగా, దీనిని తెలుగులో మాస్టర్ వేణు సంగీత దర్శకత్వం వహించిన ‘కుంకుమరేఖ’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- తమిళ చిత్రం ‘కాదలిక్కె నేరమిల్లై’ లోని ‘ఎన్న పార్వయి ఎందన్ పార్వయి’ పాటకు సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి. దీనిని తెలుగులో మాస్టర్ వేణు సంగీత దర్శకత్వం వహించిన ‘ప్రేమించి చూడు’ చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?
- ‘జైసే కో తైసా’ అనే హిందీ చిత్రంలోని ‘అబ్ కే సావన్ మే జీ డరే’ పాటని ఆర్. డి. బర్మన్ స్వరపరిచారు. దీనిని తెలుగులో సత్యం సంగీతదర్శకత్వంలో వచ్చిన ‘నోము’ సినిమాలో ఏ పాటగా వాడారు?
- ‘నాగరహావు’ అనే కన్నడ సినిమాలో విజయభాస్కర్ స్వరకల్పన చేసిన ‘కతె హేళువేనన్న కతె హేళువే’ పాటను, తెలుగులో పెండ్యాల సంగీత దర్శకత్వం వహించిన ‘కోడెనాగు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూన్ 30వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-23 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 జూలై 05వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
చెప్పుకోండి చూద్దాం-21 జవాబులు:
- సంతోషమేలా సంగీతమేలా
- నేనున్నది నీ కోసం
- ఇది పబిలిక్కురా అన్నీ తెలిసిన
- పాటల పల్లకిలో
- అన్నుల మిన్నుల
- పుడమి పుట్టెను నా కోసం
~
చెప్పుకోండి చూద్దాం-21 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- జి. భోగేశ్వర రావు, విశాఖపట్నం
- జాకీర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
- రామలింగయ్య టి, అంగలకుదురు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- ఎస్. లక్ష్మీబాయి, చెన్నయ్
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, దావణగొరె
- సునీతాప్రకాశ్, బెంగుళూరు
- పి.వి. రాజు, హైదరాబాద్
గమనిక:
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
