Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-24

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. ‘పూవా తలమై’ అనే తమిళ సినిమాలోని ‘ఆడి సరదాన్ పోడి’ పాటను ఎం.ఎస్. విశ్వనాథన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ఆర్. గోవర్ధనం సంగీత దర్శకత్వం వహించిన ‘బొమ్మా బొరుసా’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  2. ‘వక్త్’ అనే హిందీ సినిమాలోని ‘కౌన్ ఆయా కి నిగాహోం మే చమక్ జాగ్ ఉఠీ’ పాటను రవి స్వరపర్చగా, దీనిని తెలుగులో ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘భలే అబ్బాయిలు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  3. ‘బయలుదారి’ అనే కన్నడ సినిమాలోని ‘బానల్లు నీనే బువియల్లు నీనే’ పాటను రాజన్-నాగేంద్ర స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘పంతులమ్మ’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  4. ‘యాదోం కీ బారాత్’ అనే హిందీ చిత్రంలోని ‘యాదోం కీ బారాత్ నిక్‍లీ హై’ పాటని ఆర్. డి. బర్మన్ స్వరపరిచారు. దీనిని తెలుగులో చక్రవర్తి సంగీతదర్శకత్వంలో వచ్చిన ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాలో ఏ పాటగా వాడారు?
  5. ‘ఎరడు కణసు’ అనే కన్నడ సినిమాలో రాజన్-నాగేంద్ర స్వరకల్పన చేసిన ‘పూజసలెందే హూగళ తందె’ పాటను, తెలుగులో ‘పూజ’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  6. హిందీ చిత్రం ‘మౌసి’ లోని ‘టిం టిం టిం తారోంసే దీప్ జలే’ పాటకు సంగీతం వసంత్ దేశాయ్. దీనిని తెలుగులో ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘శాంతినివాసం’ చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూన్ 30వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-23 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 జూలై 05వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-22 జవాబులు:

  1. యవ్వన వీణ పువ్వుల వాన
  2. పావురానికీ పంజరానికీ
  3. తీగనై మల్లెనై
  4. మేఘమై నేను వచ్చాను
  5. తొడు తొడు వెనవె
  6. గుమ్మా గుమ్మా గుమ్మా మత్తెకించే

~

చెప్పుకోండి చూద్దాం-22 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version