Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-25

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. ‘పూవా తలయై’ అనే తమిళ సినిమాలోని ‘పొన చొన్నాల్ పాటక్కురే’ పాటను ఎం.ఎస్. విశ్వనాథన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ఆర్. గోవర్ధనం సంగీత దర్శకత్వం వహించిన ‘బొమ్మా బొరుసా’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  2. ‘నీ వరు వాయ్ ఎనా’ అనే తమిళ సినిమాలో ఎస్. ఎ. రాజకుమార్ స్వరకల్పన చేసిన ‘పూనకూయిల్ పట్టు’ పాటను, తెలుగులో ‘నిన్నే ప్రేమిస్తా’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  3. ‘సాకు మగళు’ అనే కన్నడ సినిమాలోని ‘నాను అనాద లాదే’ పాటను టి. జి. లింగప్ప స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘పెంపుడు కూతురు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  4. ‘వరుమాయిన్ నిరమ్ సివప్పు’ అనే తమిళ చిత్రంలోని ‘సిప్పి ఇరుకుత్తు ముత్తు ఇరుక్కుదు’ పాటని ఎం.ఎస్. విశ్వనాథన్ స్వరపరిచారు. దీనిని తెలుగులో ‘ఆకలిరాజ్యం’ సినిమాలో ఏ పాటగా వాడారు?
  5. ‘కోహ్రా’ అనే హిందీ సినిమాలోని ‘ఎ నయన్ డరే డరే’ పాటను హేమంత్ కుమార్ స్వరపర్చగా, దీనిని తెలుగులో పార్థసారథి సంగీత దర్శకత్వం వహించిన ‘నవమోహిని’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  6. హిందీ చిత్రం ‘కస్మే వాదే’ లోని ‘కస్మే వాదే నిభాయెంగే హమ్’ పాటకు సంగీతం ఆర్.డి. బర్మన్. దీనిని తెలుగులో సత్యం సంగీత దర్శకత్వం వహించిన ‘చేసిన బాసలు’ చిత్రంలో ఏ పాటగా వాడుకున్నారు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూలై 14తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-25 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 జూలై 19వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-23 జవాబులు:

  1. మెమ్మెమ్మే, మేకలన్ని కలసి ఉంటాయి
  2. అందాలు చిందు సీమలో ఉందాములే
  3. తీరెను కోరిక తియ్య తియ్యగా
  4. దొరికేరు దొరగారు
  5. మనసే జతగా పాడిందిలే
  6. కథ విందువా నా కథ విందువా

~

చెప్పుకోండి చూద్దాం-23 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version