Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-27

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. ‘మోటారు సుందరం పిళ్ళై’ అనే తమిళ సినిమాలోని ‘తుళ్ళి తుళ్ళి విళయాదె’ పాటను ఎం.ఎస్. విశ్వనాథన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ఎస్.పి. కోదండపాణి సంగీత దర్శకత్వం వహించిన ‘మంచి కుటుంబం’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  2. ‘శారద’ అనే తమిళ సినిమాలోని ‘మనమగళే మరుమగళే వా వా’ పాటను కె. వి. మహదేవన్ స్వరపర్చగా, దీనిని ‘సుమంగళి’ (అక్కినేని) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  3. ‘పోలీస్ కారన్ మగళ్’ అనే తమిళ సినిమాలో విశ్వనాథన్ రామ్మూర్తి స్వరకల్పన చేసిన ‘కణ్ణీలే నీరెదక్కీ’ పాటను, తెలుగులో ఆర్. గోవర్ధనం సంగీత దర్శకత్వం వహించిన ‘కానిస్టేబుల్ కూతురు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  4. ‘భామా విజయం’ అనే తమిళ చిత్రంలోని ‘వరవు ఎట్టణా సెలవు పట్టణా’ పాటని ఎం.ఎస్. విశ్వనాథన్ స్వరపరిచారు. దీనిని తెలుగులో ‘భలే కోడళ్ళు’ సినిమాలో ఏ పాటగా వాడారు?
  5. ‘వాళ్కాయ్ పడగు’ అనే తమిళ సినిమాలో విశ్వనాథన్ రామ్మూర్తి స్వరకల్పన చేసిన ‘చిన్ని చిన్ని కణ్ణనిక్కు ఎన్నదాన్’ పాటను, తెలుగులో ‘ఆడ బ్రతుకు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  6. ‘ఉన్నిరత్తిల్ ఎన్నయ్ కొడుత్తే’ అనే తమిళ సినిమాలో ఎస్. ఎ. రాజకుమార్ స్వరకల్పన చేసిన ‘వానంబాడియన్ సూర్యోదయం’ పాటను, తెలుగులో ‘రాజా’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూలై 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-27 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఆగస్టు 02వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-25 జవాబులు:

  1. వేసుకుంటా వేసుకుంటా, చెంపలు వేసుకుంటా
  2. కోయిల పాట బాగుందా
  3. నాకు కనులు లేవు, నీవు పలుక లేవు
  4. కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ.
  5. మనసే మయూరమై, వయసే వయారమై
  6. కలిసే మనసుల తొలి గీతం

~

చెప్పుకోండి చూద్దాం-25 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version