[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.
కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.
వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.
శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.
~
ప్రశ్నలు:
- బైజు బావరా’ అనే హిందీ సినిమాలోని ‘బచ్‌పన్ కే మొహబ్బత్ కో’ పాటను నౌషాద్ స్వరపర్చగా, దీనిని తెలుగులో టి.ఎ. కళ్యాణం సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘వద్దంటే డబ్బు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘ఉన్నిరత్తిల్ ఎన్నై కొడుత్తే’ అనే తమిళ సినిమాలో ఎస్. ఎ. రాజకుమార్ స్వరకల్పన చేసిన ‘ఏదో ఒరు పాట్టు’ పాటను, తెలుగులో ‘రాజా’ (వెంకటేష్) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘దో భాయ్’ అనే హిందీ సినిమాకి రీమేక్ అయిన ‘నేనూ మనిషినే’ అనే తెలుగు సినిమాలోని ‘చూసేనులే నా కనులే చూడని వింత’ పాటను వేధా స్వరపర్చారు. రాజ్‍కపూర్ నటించిన ‘చోరీ చోరీ’ అనే హిందీ సినిమాలోని ఏ పాట దీనికి మూలం?
- ‘ఎంగవూర్ రాజా’ అనే తమిళ చిత్రంలోని ‘జగదీశ్వరి, ప్రాణేశ్వరి’ పాటని ఎం.ఎస్. విశ్వనాథన్ స్వరపరిచారు. దీనిని తెలుగులో టి. చలపతిరావు సంగీత దర్శకత్వం వహించిన ‘ధర్మదాత’ సినిమాలో ఏ పాటగా వాడారు?
- ‘శారద’ అనే తమిళ సినిమాలోని ‘ఒరుత్తి ఒరువనై’ పాటను కె. వి. మహదేవన్ స్వరపర్చగా, దీనిని ‘సుమంగళి’ (అక్కినేని) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘మన పంథల్’ అనే తమిళ సినిమాలో విశ్వనాథన్-రామ్మూర్తి స్వరపరిచిన ‘ఉడులుక్కు ఉయిర్ కాదల్’ పాటను, తెలుగులో ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించిన ‘ఇంటికి దీపం ఇల్లాలే’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఆగస్టు 11వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-29 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఆగస్టు 16వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
చెప్పుకోండి చూద్దాం-27 జవాబులు:
- తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి మనసు
- కొత్త పెళ్ళి కూతురా రా రా
- కళ్ళల్లో నీరెందులకు
- ఆస్తి మూరెడు, ఆశ బారెడు.
- బుజ్జి బుజ్జి పాపాయి
- పల్లవించు తొలి రాగమే సూర్యోదయం
~
చెప్పుకోండి చూద్దాం-27 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- జాకీర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
- రామలింగయ్య టి, అంగలకుదురు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, దావణగొరె
- పి.వి. రాజు, హైదరాబాద్
గమనిక:
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
