[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.
కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.
వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.
శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.
~
ప్రశ్నలు:
- ‘గిరికన్య’ అనే కన్నడ సినిమాలోని ‘నగునగుతా నీ బరవే’ పాటను రాజన్-నాగేంద్ర స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘సొమ్మొకడిది సోకొకడిది’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘పెణ్’ అనే తమిళ సినిమాలోని ఆర్. సుదర్శనం స్వరకల్పన చేసిన ‘కళ్యాణం కళ్యాణం’ పాటను, స్వీయ సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘సంఘం’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ప్రేమ్ జోషువా హిందీ ఆల్బమ్ ‘బోలో హరి’ ని తెలుగులో మణిశర్మ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘ఇండ్రునీ నాలమ్ నాన్’ అనే తమిళ చిత్రంలోని మోట్టా ఐట్టా’ పాటను ఇళయరాజా స్వరపర్చగా, దీనిని తెలుగులో మణిశర్మ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘రాధాగోపాళం’ సినిమాలో ఏ పాటగా వాడారు?
- తమిళ సినిమా ‘ఎదిరి నీచ్చల్’ లోని ‘తామరై కణ్ణంగళ్’ పాటను వి. కుమార్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘సంబరాల రాంబాబు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ఇంగ్లీషు పాట ‘యాకె యాకె’, ‘మోరి కంటే’, ఆల్బమ్ నుంచి తెలుగులో మణిశర్మ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 అక్టోబర్ 13వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-38 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 అక్టోబర్ 18వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
చెప్పుకోండి చూద్దాం-36 జవాబులు:
- రావే రావే పోవుస్థలం అతి చేరువయే
- చీరకట్టి సింగారించి
- జీవనరాగం ఈ అనురాగం మధురానందమిదే
- గులాబి పూవై నవ్వాలి వయసు
- అందచందాల ఓ తారకా
- రావె రాధ రాణీ నీవే రాధ నీవే
~
చెప్పుకోండి చూద్దాం-36 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- జాకీర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- రామలింగయ్య టి, అంగలకుదురు
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, దావణగొరె
- సాకరే లక్ష్మీబాయి, చెన్నయ్
- కామేళె వనజాబాయి, బెంగుళూరు
- దివిటే శిల్ప, బెంగుళూరు
గమనిక:
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
