Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-3

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘గుడిగంటలు’ సినిమాలోని ‘నీలి కన్నుల నీడల లోన దోర వలపుల’ పాటకి లక్ష్మీకాంత్ – ప్యారేలాల స్వరాలు కూర్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాట మూలం?
  2. టి. చలపతిరావు స్వరాలందించిన ‘మనుషులు మమతలు’ సినిమాలోని ‘నిన్ను చూడని, నన్ను పాడని’ పాట రవి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?
  3. ఘంటసాల స్వరపరిచిన ‘అభిమానం’ సినిమాలోని ‘ఓహో బస్తీ దొరసానీ బాగా ముస్తాబయ్యింది’ పాటకి ఓ.పి. నయ్యర్ సంగీత దర్శకత్వం వహించిన ఏ హిందీ సినిమా లోని ఏ పాట మూలం?
  4. మాస్టర్ వేణు సంగీత దర్శకత్వం వహించిన ‘ఇరుగు పొరుగు’ సినిమాలోని ‘జిగేలు జిగేలుమను దొరసాని, సొగసెవ్వరికోగాని’ పాట శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?
  5. ఘంటసాల స్వరపరిచిన ‘శాంతినివాసం’ సినిమాలోని ‘రావె రాధా రాణీ రావే రాధ నీవే కృష్ణుడు నేనే’ పాట శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాట మూలం?
  6. సత్యం సంగీత దర్శకత్వం వహించిన ‘ప్రేమలేఖలు’ సినిమాలోని ‘ఈరోజు మంచి రోజు, మధురమైనది, మరపురానిది’ పాట రాజేష్ రోషన్ స్వరాలు కూర్చిన ఏ హిందీ సినిమా లోని ఏ పాటకి అనుకరణ?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఫిబ్రవరి 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-3 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఫిబ్రవరి 15వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-1 జవాబులు:

  1. ఉస్ నే కహా థా, బల్‌ఖాతీ షర్మాతీ ఆ జా
  2. దోఁ కలియా, తుమ్హారీ నజర్ క్యూఁ ఖఫా హో గయీ
  3. షబ్నమ్, హస్మిన్ అలా హయా హబ్బి – హర్ నజర్ మే సౌ అఫ్‌సానే
  4. సెహ్రా, పంఖ్ హోతే తో ఉడ్ ఆతీ రే రసియా ఓ బలమా
  5. జ్యూయల్ థీఫ్, ఓ ఓ దిల్ పుకారె ఆరె ఆరె ఆరె
  6. దిల్ దేకే దేఖో, దిల్ దేకే దేఖో దిల్ దేఖో దిల్ దేకే దేఖో జీ

~

చెప్పుకోండి చూద్దాం-1కి సరైన సమాధానాలు పంపిన వారు:

ఎవరూ లేరు

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version