[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.
కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.
వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.
శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.
~
ప్రశ్నలు:
- ‘బడే బహెన్’ అనే హిందీ సినిమాలోని ‘చుప్ చుప్ ఖడీ హో జరూర్ కోయీ బాత్ హై’ పాటను హుస్న్‌లాల్ భగత్‌రామ్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ఆర్. గోవర్ధనం సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘జీవితం’ (1950) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా’ అనే హిందీ సినిమాలో ఓ. పి. నయ్యర్ స్వరకల్పన చేసిన ‘ఓ ముఝే దేఖ్ కర్ ఆప్‌కా ముస్కురానా’ పాటను, తెలుగులో పెండ్యాల గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘రాము’ అనే తమిళ చిత్రంలోని ‘ముత్తు చిప్పి చిప్పి’ పాటని ఎం.ఎస్. విశ్వనాథన్ స్వరపరిచారు. దీనిని తెలుగులో ఆర్. గోవర్ధనం సంగీత దర్శకత్వం వహించిన ‘రాము’ (ఎన్.టి.ఆర్) సినిమాలో ఏ పాటగా వాడారు?
- ‘జంగ్లీ’ అనే హిందీ సినిమాలోని శంకర్-జైకిషన్ స్వరకల్పన చేసిన ‘కాశ్మీర్ కీ కలీ హుఁ మై’ పాటను, తెలుగులో టి. చలపతి రావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘లక్షాధికారి’ (ఎన్.టి.ఆర్) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘మన పంథల్’ అనే తమిళ సినిమాలో విశ్వనాథన్-రామ్మూర్తి స్వరపరిచిన ‘ఒరే రాగం ఒరే తాళం ఒరే పాడల్’ పాటను, తెలుగులో ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించిన ‘ఇంటికి దీపం ఇల్లాలే’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘షికారీ’ అనే హిందీ సినిమాలోని ‘ఓ తుమ్ కో పియా దిల్ దియా’ పాటను జి.ఎస్. కోహ్లీ స్వరపర్చగా, దీనిని , తెలుగులో కె.వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ‘అంతస్తులు’ (అక్కినేని) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఆగస్టు 18వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-30 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఆగస్టు 23వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
చెప్పుకోండి చూద్దాం-28 జవాబులు:
- ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
- గాలి, చిరుగాలి
- మల్లెల వాన మల్లెల వాన
- మనసున ఉన్నది
- అమ్మో అమ్మాయేనా, ఎల్లోరా శిల్పమా
- చందురుని మించు అందమొలికించు
~
చెప్పుకోండి చూద్దాం-28 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- జాకీర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాదు
- రామలింగయ్య టి, అంగలకుదురు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, దావణగొరె
- ఎస్. విజయశాంతి, చెన్నయ్
- ఎస్. లలితాబాయ్, చెన్నయ్
- వర్ధని మాదిరాజు, బెంగుళూరు
- ఆర్. రఘునాథ రావు, ఆదోని
గమనిక:
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
