Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-31

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. ‘పోలీస్ కారన్ మగన్’ అనే తమిళ సినిమాలోని ‘నిలవక్కు ఎన్నే’ పాటను విశ్వనాథన్-రామ్మూర్తి స్వరపర్చగా, దీనిని తెలుగులో ఆర్. గోవర్ధనం సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘కానిస్టేబుల్ కూతురు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  2. ‘న్యాయవే దేవరు’ అనే కన్నడ సినిమాలో రాజన్-నాగేంద్ర స్వరకల్పన చేసిన ‘ఆకాశవే బీళలి మేలే’ పాటను, తెలుగులో ‘మూడుముళ్ళు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  3. ‘దాగ్’ (1952) అనే హిందీ సినిమాలోని శంకర్-జైకిషన్ స్వరకల్పన చేసిన ‘ఐ మెరే దిల్ కహ్ ఔర్ చల్’ పాటను, తెలుగులో టి. ఎ. కల్యాణం గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిజ్ఞ’ (1953) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  4. ‘పెరియ ఇడత్తు పెణ్’ అనే తమిళ చిత్రంలోని ‘పారప్పా పళనియప్పా’ పాటని విశ్వనాథన్-రామ్మూర్తి స్వరపరిచారు. దీనిని తెలుగులో పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించిన ‘శభాష్ సూరి’ (ఎన్.టి.ఆర్) సినిమాలో ఏ పాటగా వాడారు?
  5. ఈజిప్షియన్ సినిమాలో ‘బాబ్ ఆజ్జం’ పాడిన ‘యా ముస్తఫా’ పాటను, తెలుగులో ఎస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించిన ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  6. ‘కళ్యాణ పరస్’ అనే తమిళ సినిమాలోని ‘వాడిక్కె మరుదుది’ పాటను ఎ.ఎమ్. రాజా స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘పెళ్ళికానుక’ (అక్కినేని) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఆగస్టు 25వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-31 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఆగస్టు 30వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-29 జవాబులు:

  1. మనసే చలించెనయో
  2. ఏదో ఒక రాగం
  3. పంఛీ బనూ ఉఢ్ కే ఫిరూ మస్త్ గగన్ మే
  4. ఓం పరమేశ్వరి, జగదీశ్వరి, రాజేశ్వరి, ఇకనైనా శాంతించవే.
  5. కనులు కనులతో కలబడితే
  6. ఎవరికి ఎవరు కాపలా? ఈ బంధాలన్నీ నీకేలా?

~

చెప్పుకోండి చూద్దాం-29 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version