
[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.
కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.
వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.
శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.
~
ప్రశ్నలు:
- ‘రాము’ అనే తమిళ సినిమాలోని ‘పచ్చెయ్ మరం బండు’ పాటను ఎమ్.ఎస్. విశ్వనాథన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ఆర్. గోవర్ధనం సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘రాము’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘ఉస్తాదోం కా ఉస్తాద్’ అనే హిందీ సినిమాలో రవి స్వరకల్పన చేసిన ‘మైనే కహా థా ఆనా సండే కో’ పాటను, తెలుగులో టి. చలపతిరావు సంగీతదర్శకత్వంలో వచ్చిన ‘గూఢచారి 116’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘ఆటో రాజా’ అనే కన్నడ సినిమాలోని రాజన్-నాగేంద్ర స్వరకల్పన చేసిన ‘నిన్న ఆశే హణ్ణాగి’ పాటను, తెలుగులో ‘పులి బెబ్బులి’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘7 G రెయిన్‌బో కాలనీ’ అనే తమిళ చిత్రంలోని ‘నినైత్తు నినైత్తుపార్తె’ పాటని యవన్ శంకర్ రాజా స్వరపరిచారు. దీనిని తెలుగులో ‘7 G బృందావన్ కాలనీ’ సినిమాలో ఏ పాటగా వాడారు?
- కన్నడ సినిమా ‘ఎరడు కనసు’లోని ‘బాడిహోడ బల్లియింద’ పాటను, తెలుగులో ‘పూజ’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ఆన్‌డ్రె పాప్ స్వరపరిచిన ‘లవ్ ఈజ్ బ్లూ’ (1957) అనే ఫ్రెంచ్ పాటను, తెలుగులో ఎస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించిన ‘చిట్టి చెల్లెలు’ (1970) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 సెప్టెంబర్ 01వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-32 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 సెప్టెంబర్ 06వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
చెప్పుకోండి చూద్దాం-30 జవాబులు:
- టిక్కు టిక్కు టిక్కు లాడెదా, చక్కనైన చుక్క
- ఓ చెలీ కోపమా, అంతలో తాపమా
- మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే
- దాచాలంటే దాగదులే, దాగుడుమూతలు చాలునులే
- ఒకే రాగం, ఒకే తాళం, ఒకే గీతం పాడెనమ్మా
- వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్నా
~
చెప్పుకోండి చూద్దాం-30 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- జాకీర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, దావణగొరె
- కె. వనజాబాయి, బెంగుళూరు
- రామలింగయ్య టి, అంగలకుదురు
- ఎస్. లక్ష్మీబాయి, చెన్నయ్
- సునీతా ప్రకాశ్, బెంగుళూరు
గమనిక:
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
