Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-33

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

నలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. ‘కందన్ కరుణై’ అనే తమిళ సినిమాలోని ‘తిరుపరన్ కుండ్రితిల్’ పాటను కె.వి. మహదేవన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  2. ‘ఒపెరా హౌస్’ అనే హిందీ సినిమాలోని చిత్రగుప్త స్వరకల్పన చేసిన ‘బల్‍మా మానేనా’ పాటను, ఎస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘పూజాఫలం’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  3. ‘నాస్తిక్’ అనే హిందీ సినిమాలో సి. రామచంద్ర స్వరకల్పన చేసిన ‘దేఖ్ తేరే సంసార్ కీ హాలత్’ పాటను, తెలుగులో ఎస్. దక్షిణామూర్తి సంగీతదర్శకత్వంలో వచ్చిన ‘ఉమాసుందరి’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  4. ‘పాశం’ అనే తమిళ చిత్రంలోని ‘ఉరవు సొల్ల వొరు వరింద వాన్బవన్’ పాటని విశ్వనాథన్-రామ్ముర్తి స్వరపరిచారు. దీనిని తెలుగులో ‘మంచి చెడు’ సినిమాలో ఏ పాటగా వాడారు?
  5. తమిళ సినిమా ‘వీర అభిమన్యు’ లోని ‘పోదం పుదు ఉంగం’ పాటను కె.వి. మహదేవన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘వీరాభిమన్యు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  6. తమిళ సినిమా ‘నిశ్చయ తాంబూలం’ లోని ‘మాలై సూడుం మనవాళ్’ పాటను పాటని విశ్వనాథన్-రామ్ముర్తి స్వరపరిచారు. తెలుగులో ‘పెళ్లి తాంబూలం’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 సెప్టెంబర్ 08తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-33 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 సెప్టెంబర్ 13వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-31 జవాబులు:

  1. వెన్నెలకేలా నాపై కోపం
  2. నీ కోసం యవ్వనమంతా
  3. సాగనీ జీవితం జోరుగా
  4. చూడు చూడు పట్టయ్యా
  5. హలో హలో ఓ అమ్మాయి
  6. వాడుక మరచెదవేలా?

~

చెప్పుకోండి చూద్దాం-31 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version