[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.
కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.
వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.
శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.
~
ప్రశ్నలు:
- ‘ఫకీరా’ అనే హిందీ సినిమాలో రవీంద్రజైన్ స్వరకల్పన చేసిన ‘సున్ కే తేరీ పుకార్’ పాటను, తెలుగులో సత్యం సంగీతదర్శకత్వంలో వచ్చిన ‘దొంగలకి దొంగ’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘బెంకియ బలె’ అనే కన్నడ సినిమాలోని ‘ఉలిద జీవన’ పాటను రాజన్-నాగేంద్ర స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘రెండు రెళ్ళు ఆరు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘ఆలయమణి’ అనే తమిళ చిత్రంలోని ‘తూక్కమె కన్‌గళ్’ పాటని విశ్వనాథన్-రామ్ముర్తి స్వరపరిచారు. దీనిని తెలుగులో ఘంటశాల సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘గుడి గంటలు’ సినిమాలో ఏ పాటగా వాడారు?
- ఇంగ్లీషు గాయకుడు క్లిఫ్ రిచర్డ్స్ ఆలపించిన ‘ది యంగ్ వన్స్’ పాటను తెలుగులో పెండ్యాల గారు ‘శభాష్ సూరి’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- తమిళ సినిమా ‘అవల్ తోడర్ కథై’ లోని ‘కడవుళ మొత్తం వేడై’ పాటను ఎం. ఎస్. విశ్వనాథన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘అంతులేని కథ’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘కారవాన్’ అనే హిందీ సినిమాలోని ఆర్.డి. బర్మన్ స్వరకల్పన చేసిన ‘దిల్‌బర్ దిల్ సే ప్యారే’ పాటను, టి. చలపతిరావు సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘పవిత్ర హృదయాలు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 సెప్టెంబర్ 15వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-34 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 సెప్టెంబర్ 20వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
చెప్పుకోండి చూద్దాం-32 జవాబులు:
- పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలకలు
- మనసు తీరా నవ్వులు నవ్వులు
- పరిమళించు పున్నమిలో
- తలచి తలచి చూస్తే
- మల్లెతీగ వాడిపోగ
- ఈ రేయి తీయనిది
~
చెప్పుకోండి చూద్దాం-32 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- జాకీర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, దావణగొరె
- ఎస్. లక్ష్మి, చెన్నై
- సుష్మ, చెన్నై
- దీప్తి, చెన్నై
గమనిక:
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
