[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.
కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.
వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.
శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.
~
ప్రశ్నలు:
- ‘పావమన్నిప్పు’ అనే తమిళ చిత్రంలోని ‘అత్తాన్ ఎన్నత్తాన్’ పాటని విశ్వనాథన్-రామ్ముర్తి స్వరపరిచారు. దీనిని తెలుగులో కోడండపాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే కుటుంబం’ సినిమాలో ఏ పాటగా వాడారు?
- ‘హొంబిసిలు’ అనే కన్నడ సినిమాలోని ‘నీరబిట్టు నేలదమేలె’ పాటను రాజన్-నాగేంద్ర స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘మూడు ముళ్ళు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘సుబహ్ కా తారా’ అనే హిందీ సినిమాలో సి. రామచంద్ర స్వరకల్పన చేసిన ‘గయా అంధేరా హువా ఉడియారా’ పాటను, తెలుగులో సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘సంతానం’ (అక్కినేని) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- తమిళ సినిమా ‘అవల్ తోడర్ కథై’ లోని ‘కన్గళే నిన్నవండు కన్గళి’ పాటను ఎం. ఎస్. విశ్వనాథన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘అంతులేని కథ’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ఇంగ్లీషు గాయకుడు ది కింగ్‌స్టన్ ట్రియో ఆలపించిన ‘హంగ్ డౌన్ యువర్ హెడ్ టామ్ డాలే’ పాటను తెలుగులో ఎస్. రాజేశ్వరరావు గారు ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘పెణ్’ అనే తమిళ సినిమాలోని ఆర్. సుదర్శనం స్వరకల్పన చేసిన ‘సొన్నసొల్లె మరళిదు’ పాటను, స్వీయ సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘సంఘం’ (ఎన్.టి.ఆర్.) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 సెప్టెంబర్ 22వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-35 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 సెప్టెంబర్ 27వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
చెప్పుకోండి చూద్దాం-33 జవాబులు:
- ఇరువురి భామల కౌగిలిలో
- మదనా మనసాయరా
- నమ్మకురా ఇల్లాలు పిల్లలు
- తోడు నీడ ఎవరూ లేని ఒంటరి
- అదిగో నవలోకం వెలసె మన కోసం
- ప్రేమ నిండిన ఇల్లే, నవ స్వర్గముగా విలసిల్లే
~
చెప్పుకోండి చూద్దాం-33 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- జాకీర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, దావణగొరె
- జాకీర్ హుస్సేన్ ఎమ్.డి., ఆదోని
గమనిక:
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
