Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-36

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. ‘మంత్రికుమారి’ అనే తమిళ చిత్రంలోని ‘వారాయ్ నీ వారాయ్’ పాటని జి. రామనాథన్ స్వరపరిచారు. దీనిని తెలుగులో సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘వీర కంకణం’ సినిమాలో ఏ పాటగా వాడారు?
  2. తమిళ సినిమా ‘పడిక్కాద మేధై’ లోని ‘సేవి ముడిచు సింగారించు’ పాటను కె. వి. మహదేవన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘ఆత్మబంధువు’ (ఎన్.టి.ఆర్.) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  3. ‘సాకు మగళు’ అనే కన్నడ సినిమాలోని ‘జీవన రాగ ఈ అనురాగ’ పాటను టి.జి. లింగప్ప స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘పెంపుడు కూతురు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  4. ‘యాదోం కీ బారాత్’ అనే హిందీ సినిమాలో ఆర్.డి. బర్మన్ స్వరకల్పన చేసిన ‘చురా లియా హై దిల్ కో సనమ్’ పాటను, తెలుగులో చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  5. ‘మద్ మగన్ తేవై’ అనే తమిళ సినిమాలోని జి. రామనాథన్ స్వరకల్పన చేసిన ‘వెన్నిలాజ్యోతివై’ పాటను, స్వీయ సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘వరుడు కావాలి’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  6. ‘ఉజాలా’ అనే హిందీ సినిమాలో శంకర్-జైకిషన్ స్వరకల్పన చేసిన ‘ఝూమ్‍తా మౌసమ్ మస్త్ మహీనా’ పాటను, తెలుగులో ఘంటసాల సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘శాంతి నివాసం’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 సెప్టెంబర్ 29వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-36 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 అక్టోబర్ 04వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-34 జవాబులు:

  1. ఎవరేమన్ననూ, తోడు రాకున్నన్నా
  2. విరహ వీణ
  3. నీ కనుదోయి నిద్దురనై
  4. ఈ వెన్నెల, ఈ పున్నమి వెన్నెల
  5. తాళికట్టు శుభవేళ
  6. చిరునవ్వుల చినవాడే

~

చెప్పుకోండి చూద్దాం-34 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version