[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.
కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.
వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.
శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.
~
ప్రశ్నలు:
- 1948లో వచ్చిన హిందీ సినిమా ‘అనోఖీ అదా’ లో నౌషాద్ స్వరకల్పన చేసిన ‘క్యూఁ ఉన్హే దిల్ దియా హాయ్’ పాటను, తెలుగులో పెండ్యాల సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘మొదటి రాత్రి’ (1950) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘పాశమలార్’ అనే తమిళ చిత్రంలోని ‘ఎంగళుక్కుం కాలం వరున్’ పాటని విశ్వనాథన్-రామ్మూరి స్వరపరిచారు. దీనిని తెలుగులో ఘంటసాల సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘రక్తసంబంధం’ (ఎన్.టి.ఆర్.) సినిమాలో ఏ పాటగా వాడారు?
- తమిళ సినిమా ‘తై పిరందాల్ వళి పిరక్కుం’ లోని ‘మన్నుకు మరయ్ బారమా’ పాటను కె. వి. మహదేవన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ఘంటసాల సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘మంచి మనసుకు మంచి రోజులు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘రాజా నన్న రాజా’ అనే కన్నడ సినిమాలోని ‘నూరు కణ్ణు సాలదు’ పాటను జి. కె. వెంకటేష్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘జాతర’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘బ్రహ్మచారి’ అనే హిందీ సినిమాలో శంకర్-జైకిషన్ స్వరకల్పన చేసిన ‘మై గావూఁ తుమ్ సో జావో’ పాటను, తెలుగులో ఎస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘చిట్టి చెల్లెలు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
- ‘నానున్ ఒరు పెణ్’ అనే తమిళ సినిమాలోని ఆర్. సుదర్శనం స్వరకల్పన చేసిన ‘ఏ మారి సొన్నుదు నానో’ పాటను, స్వీయ సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘నాదీ ఆడజన్మే’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 అక్టోబర్ 06వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-37 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 అక్టోబర్ 11వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
చెప్పుకోండి చూద్దాం-35 జవాబులు:
- ఔనే తానే నన్నేనే
- లేత చలిగాలులు
- సంతోషమేలా, సంగీతమేలా
- కళ్ళలో ఉన్న నీరు కన్నులకే తెలుసు
- ఖుషీ ఖుషీగా నవ్వుతూ
- సుందరాంగా మరువగలేనోయ్ రావేలా!
~
చెప్పుకోండి చూద్దాం-34 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- జాకీర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శ్రేయ ఎస్. క్షీరసాగర్, దావణగొరె
గమనిక:
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
