Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెప్పుకోండి చూద్దాం-39

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘చెప్పుకోండి చూద్దాం’ అనే సాంగ్స్ క్విజ్ ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

మనలో చాలామందికి సినిమా పాటలంటే ఇష్టం. కొందరు గొంతెత్తి పాడుకుంటే, మరికొందరం మౌనంగా వింటూ గీతాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తాం.

కొన్ని పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా తోస్తాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాష లోకి డబ్ చేసినప్పుడు ఆ సినిమా లోని పాటల ట్యూన్‌లని యథాతథంగా ఉపయోగించుకుంటూ, సాహిత్యం మార్చి డబ్బింగ్ సినిమాలో ఉంచుతారు. ఐతే భారతీయ చలనచిత్ర రంగంలో హిందీ సినిమాలలో హిట్ అయిన పాటల బాణీలను ప్రాంతీయ సినిమాలలోనూ, ప్రాంతీయ సినిమాలలో సూపర్ హిట్ అయిన బాణీలను హిందీ లోనూ ఉపయోగించుకోడం కద్దు.

కొందరు అనుమతి తీసుకుని వాడతారు, కొందరు స్ఫూర్తిపొందామని అంటారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ, ఇతర భాషలలోనూ బాగా హిట్ అయిన కొన్ని పాటల మూలాలు ఎక్కడున్నాయో తెల్సుకునే ప్రయత్నం చేద్దామంటున్నారు శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.

వారానికి ఐదు/ఆరు పాటలను పేర్కొని, ఆ పాటలకి మూలం ఏ భాషలో, ఏ సినిమాలోనిదో చెప్పమంటూ పాఠకులను క్విజ్‌లా అడుగుతారు.

శ్రీనివాసరావు గారు గతంలో నిర్వహించిన శీర్షికలలానే ఇది కూడా పాఠకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

~

ప్రశ్నలు:

  1. హిందీ సినిమా ‘తేజాబ్’ లోని ‘ఏక్ దో తీన్ చార్ పాంచ్’ పాటకి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వరాలు అందించారు. ఈ పాటని తెలుగులో రాజ్‍కోటి సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘టు టౌన్ రౌడీ’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  2. ‘ఇరుకొడుగల్’ అనే తమిళ సినిమాలోని వి. కుమార్ స్వరకల్పన చేసిన ‘నాన్ ఒరు గుమాస్తా’ పాటను, స్వీయ సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘కలెక్టర్ జానకి’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  3. ‘తయ్ పిరందాల్ వళి పిరక్కుం’ అనే తమిళ సినిమాలోని ‘ఆశయే అలైబోలే’ పాటను కె. వి. మహదేవన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ఘంటసాల సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘శభాష్ రాముడు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  4. ‘పెరియ ఇడత్తు పెణ్’ అనే తమిళ చిత్రంలోని ‘కట్టోడు కుళలాడ ఆడ’ పాటను విశ్వనాథన్-రామ్మూర్తి స్వరపర్చగా, దీనిని తెలుగులో పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘శభాష్ సూరి’ సినిమాలో ఏ పాటగా వాడారు?
  5. తమిళ సినిమా ‘ఇరుళుమ్ ఒళియమ్’ లోని ‘తిరుమగల్ తేడి వందాల్’ పాటను కె. వి. మహదేవన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘ఇద్దరు అమ్మాయిలు’ సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?
  6. తమిళ సినిమా ‘ఇదయ కమలమ్’ లోని ‘ఉన్నైకారద కణ్ణం కణ్ణల్లా’ పాటను కె. వి. మహదేవన్ స్వరపర్చగా, దీనిని తెలుగులో ‘ఇల్లాలు’ (గీతాంజలి హీరోయిన్) సినిమాలో ఏ పాటగా ఉపయోగించారు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 అక్టోబర్ 20వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘చెప్పుకోండి చూద్దాం-39 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 అక్టోబర్ 25వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

చెప్పుకోండి చూద్దాం-37 జవాబులు:

  1. చెలియా ఈ సుమము ఏ రంగులీనునో
  2. మంచి రోజు వస్తుంది మాకు బ్రతుకునిస్తుంది
  3. ధరణికి గిరి భారమా, గిరికి తరువు
  4. మాఘమాస వేళలో
  5. అందాలా పసిపాపా
  6. నా మాట నమ్మితివేలా, నా మీద కోపమదేలా?

~

చెప్పుకోండి చూద్దాం-37 కి సరైన సమాధానాలు పంపిన వారు:

గమనిక:

  1. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  2. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version